Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: గబ్బా ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌ చేస్తే గబ్బు పట్టిస్తున్నాడుగా.. రిషభ్ పంత్‌పై పేలుతున్న సెటైర్స్!

IND vs SA: Rishabh Pant brutally trolled after India lose 2nd T20

కటక్‌: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సఫారీ చేతిలో భారత్‌కు చుక్కెదురైంది. సిరీస్‌కు ముందు వరుసగా 12 టీ20 మ్యాచ్‌ల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీ సవాల్‌కు నిలువలేకపోతోంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌ పవర్‌కు తొలి టీ20 మ్యాచ్‌ను సమర్పించుకున్న టీమిండియా... రెండో టి20లో సఫారీ బౌలింగ్‌ దెబ్బకు తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. సిరీస్‌ను నెగ్గాలంటే భారత్‌ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కెప్టెన్‌గా విఫలం..

ఈ సిరీస్‌తో టీ20ల్లో తొలిసారి భారత జట్టును నడిపిస్తున్న రిషభ్ పంత్ అటు బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. అనూహ్యపరిస్థితుల్లో చివరి నిమిషంలో అతను గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవడంతో రిషభ్ పంత్ తాత్కలిక సారథి జట్టును నడిపిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా తన మార్క్ పెర్ఫామెన్స్‌ను చూపించలేకపోతున్నాడు. దాంతో పంత్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

స్చేచ్చగా నిర్ణయాల్లేవ్..

మైదానంలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పంత్.. అనవసర తప్పిదాలతో భారత విజయవకాశాలను దెబ్బతీస్తున్నాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు చేయలేక సతమతమవుతున్నాడు. తొలి టీ20లో యుజ్వేంద్ర చాహల్‌తో నాలుగు ఓవర్లు కూడా వేయించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రెండో టీ20లోనూ పవర్ ప్లేలోనే బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు క్రీజులో ఉన్న ఏ కెప్టెన్ అయినా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ పంత్ మాత్రం నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు.

సహచర ఆటగాళ్ల జోక్యం..

రిషభ్ పంత్ ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా అనేది డౌటే. ఐపీఎల్లో కెప్టెన్సీ సేవలందించిన ప్లేయర్లు తమ అనుభవాన్ని ఇండియా జట్టులో చూపించాలని బాగా తహతహలాడుతున్నట్లు కన్పిస్తుంది. ఫీల్డింగ్ సెట్ విధానంలో మిగతా వాళ్ల ప్రమేయం ఫీల్డ్‌లో ఎక్కువైనట్లు కన్పిస్తోంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజమాయిషీ కాస్త ఎక్కువ ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలోనే పంత్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

గబ్బు పట్టిస్తున్నారు కదా..?

గత కొంత కాలంగా రిషభ్ పంత్ విఫలమవుతున్నా అతనికి అంత ప్రాధానత్య ఇవ్వడానికి ప్రధాన కారణం గబ్బా ఇన్నింగ్సేనని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా ఇన్నింగ్స్‌తో పంత్ చారిత్మాత్మక విజయాన్నందించాడు. ఇక ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గబ్బా ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌ చేస్తే గబ్బు పట్టిస్తున్నాడు కదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. సౌతాఫ్రికా నాలుగో వికెట్ తీయడం మిస్టరీగా మారిందంటున్నారు.

Story first published: Monday, June 13, 2022, 8:40 [IST]
Other articles published on Jun 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+