For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: టీమిండియా కొంపముంచిన శ్రేయస్ అయ్యర్ తప్పిదం.. లాలి పాప్ క్యాచ్‌ను...!

IND vs SA: Rassie van der Dussen says Had to make India pay after Shreyas Iyer dropped my catch

న్యూఢిల్లీ: సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో భారత్‌కు చుక్కెదురైంది. వరుసగా 13వ టీ20 విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్‌ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. వాన్‌డెర్‌ డసెన్‌ (46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు 75 నాటౌట్‌), 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డేవిడ్‌ మిల్లర్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారత్ విధించిన కొండంత లక్ష్యం చిన్నబోయింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చేసిన ఘోర తప్పిదం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన వాన్‌డెర్ డసెన్ 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు.

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో అవేష్ ఖాన్ బౌలింగ్‌లో డసెన్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. కానీ.. బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ చేతుల్లోకి నేరుగా బంతి వెళ్లింది. కానీ.. తత్తరపాటుకు గురైన శ్రేయస్ అయ్యర్ బంతిని జారవిడిచాడు. ఈ లైఫ్‌తో చెలరేగిన డసెన్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ క్యాచ్ శ్రేయస్ పట్టుంటే.. నాలుగో వికెట్‌కు 64 బంతుల్లో నమోదైన 131 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడేది. అప్పుడు భారత్‌కు విజయవకాశాలు ఉండేవి.

ఆ తప్పిదమే కలిసొచ్చింది...

ఆ తప్పిదమే కలిసొచ్చింది...

శ్రేయస్ అయ్యర్ తన క్యాచ్‌ను వదిలేయడం సౌతాఫ్రికాకు కలిసొచ్చిందని డసెన్ తెలిపాడు. 'ఈ మ్యాచ్‌లో నా క్యాచ్ జారవిడచమే కీలకంగా మారింది. భారత్ జట్టు ఆ తప్పిదానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నాకు తెలుసు. పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనువుగా అనిపించింది. అందుకే.. తొందరపడకుండా క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాను'' అని మ్యాచ్ అనంతరం డసెన్ చెప్పుకొచ్చాడు.

సఫారీ శుభారంభం..

సఫారీ శుభారంభం..

మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్‌ డసెన్‌ (46 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డేవిడ్‌ మిల్లర్‌ (31 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు.

Story first published: Friday, June 10, 2022, 12:51 [IST]
Other articles published on Jun 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+