Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి.. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే..?

 IND vs SA: Rahul Dravid says India hopeful about Jasprit Bumrah travelling to Australia

గౌహతి: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ దూరం కాలేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. అతని గైర్హాజరీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బుమ్రా ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం వేచి చూస్తున్నామని తెలిపాడు. ఇక వెన్ను నొప్పి కారణంగా బుమ్రా సౌతాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. మెగా టోర్నీ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే బుమ్రా గాయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇప్పటికే స్పందించాడు. బుమ్రా ఇంకా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించలేదని, దీనిపై ఉత్కంఠ నెలకొందన్నాడు. అతను జట్టుకు దూరమైనట్లు ఇప్పుడే చెప్పకండని తెలిపాడు. తాజాగా టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ కూడా బుమ్రా వ్యవహారంపై స్పందించాడు.

సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే..

సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే..

ఆదివారం సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో శనివారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ప్రకారం.. జస్‌ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో లేడు. నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ వైద్య బృందం పరిశీలించి పరిస్థితి ఏంటనేది వెల్లడిస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందనే తెలియాలంటే వేచి చూడాలి.

 తిరిగొస్తాడనుకుంటున్నాం..

తిరిగొస్తాడనుకుంటున్నాం..

గత మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించలేదు. నిపుణులు చెప్పేదానిపైనే నేను ఆధారపడతాను. ప్రస్తుతం బుమ్రాను సౌతాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే తప్పించారు. అధికారికంగా ఇప్పటికీ అతను టీ20 ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగినట్లు కాదు. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం' అంటూ ద్రవిడ్‌ వెల్లడించాడు. సౌతాఫ్రికాతో మిగతా రెండు టీ20లకు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

బుమ్రా భవితవ్యం తేలేది ఆ రోజే..

బుమ్రా భవితవ్యం తేలేది ఆ రోజే..

బుమ్రా గాయం గురించి ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి.. జట్టుతోనే బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్తాడని, అక్టోబర్ 15న అతని గాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. 'బుమ్రాకు విశ్రాంతి అవసరం. అతని బ్యాక్ ఇంజ్యూరీకి అదే సరైన ఔషదం. ప్రస్తుతం అతను ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫిజియో నితిన్ పటేల్ అతని గాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. మేం ఇప్పుడే అతన్ని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించాలనుకోవడం లేదు. అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియా కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా అతని గాయం రికవరీ ప్రాసెస్ కొనసాగనుంది. అక్టోబర్ 15 వరకు వేచి చూసి ఆ రోజే తుది నిర్ణయం తీసుకుంటాం'అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

అక్టోబర్ 6న పయనం..

అక్టోబర్ 6న పయనం..

ఇక అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ ముగిసిన రెండు రోజులకు అక్టోబర్ 6న టీమిండియా ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. పెర్త్‌లో మెగాటోర్నీ కోసం సన్నదమవ్వనుంది. బుమ్రా కూడా జట్టుతో వెళ్లనుండగా.. అతనితో రిహాబ్ టీమ్‌ కూడా ఉండనుంది. అక్టోబర్ 15లోపు అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోతే.. ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే స్టాండ్ బై జాబితాలో కొత్తగా ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరితో పాటు స్టాండ్ బైగా ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్ కూడా జట్టుతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

Story first published: Saturday, October 1, 2022, 19:07 [IST]
Other articles published on Oct 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+