For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: ఉమ్రాన్ మాలిక్‌ అరంగేట్రం ఆలస్యం.. అర్ష్‌దీప్ సింగ్‌కే చాన్స్! హింట్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్!

IND vs SA: Rahul Dravid hints Umran Malik might have to wait for his debut
Rahul Dravid says players without tattoo can also win the match | Oneindia News

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం(జూన్ 9)ఢిల్లీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం కష్టమేనని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పటికీ అతను నేర్చుకునే దుశలోనే ఉన్నాడని చెప్పాడు.

ఉమ్రాన్‌ కంటే అర్ష్‌దీప్ మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడని పరోక్షంగా పేర్కొన్నాడు. ఈ సిరీస్ నేపథ్యంతో బుధవారం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ తుది జట్టు ఎంపికపై క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌ 2022 సీజ‌న్‌లో భారత ఆటగాళ్లు కెప్టెన్లుగా విజయవంతం కావడం జాతీయ జట్టుకు ఉపయోగపడుతుందని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు.

ఉమ్రాన్‌లో సూపర్ పేస్..

ఉమ్రాన్‌లో సూపర్ పేస్..

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆకట్టుకున్న జమ్ముకశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌‌కు వెంటనే తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. ‘అవును.. అతను మంచి వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఎక్కువ మంది భారత బౌలర్లు ఐపీఎల్‌లో చాలా వేగంతో బౌలింగ్‌ చేయడం నన్ను ఆకట్టుకుంది. టెస్టుల్లోనూ వాళ్లు అలా బౌలింగ్‌ చేస్తారని మూడు ఫార్మాట్ల కోచ్‌గా ఆశిస్తున్నా. అయితే నెట్స్‌లో ఉమ్రాన్‌ గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతనిలో మంచి పేస్‌ ఉంది. అయితే అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు.

అరంగేట్రం ఆలస్యం..

అరంగేట్రం ఆలస్యం..

ఉమ్రాన్‌ ఇంకా కుర్రాడే. రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. ఆడుతున్నకొద్దీ ఇంకా మంచి బౌలర్‌ అవుతాడు. మాకైతే అతను జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అతనికి ఎన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వగలమో చూడాలి. మేం వాస్తవికంగా ఉండాల్సిన అవసరముంది. మా జట్టు పెద్దది. అందరికీ తుది జట్టులో చోటివ్వడం కుదరదు. అర్ష్‌దీప్‌ రూపంలో మరో చక్కని యువ పేసర్‌ జట్టులో ఉన్నాడు'అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు. ద్రవి వ్యాఖ్యలను బట్టి ఉమ్రాన్ మాలిక్ అరంగేట్ర ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

 అతడు వచ్చినందుకు సంతోషం

అతడు వచ్చినందుకు సంతోషం

హార్దిక్‌ పాండ్యా రీఎంట్రీపై ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ''హార్దిక్‌ తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతను అద్భుతమైన క్రికెటర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్‌ విశేషంగా రాణించాడు. ఐపీఎల్‌లోనూ గొప్ప ఫామ్‌ను ప్రదర్శించాడు. అతని కెప్టెన్సీ కూడా గొప్పగా ఉంది. నాయకత్వ బృందంతో భాగంగా ఉండాలంటే కెప్టెన్సీనే ఉండాల్సిన అవసరం లేదు. హార్దిక్‌ మళ్లీ బౌలింగ్‌ చేస్తుండడం మాకు సానుకూలాంశం'' అని ద్రవిడ్ తెలిపాడు. .

టీమిండియాకు అడ్వాంటేజ్

టీమిండియాకు అడ్వాంటేజ్

ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత కెప్టెన్లు సత్తా చాటడంపై ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు.‘చాలా మంది భారత కెప్టెన్లు రాణించడం మంచి విషయం. ఆ సారథుల్లో హార్దిక్‌ ఒకడు. జట్టును గొప్పగా నడిపించాడు. లక్నో కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, రాజస్థాన్‌ కెప్టెన్‌గా సంజు, కోల్‌కతా సారథిగా శ్రేయస్‌ ఆకట్టుకున్నారు.

ఈ యువ బ్యాటర్లు జట్టును ముందుండి నడిపించడం చూస్తుంటే సంతోషం కలుగుతోంది. ఇది ఆటగాళ్లుగా ఎదగడానికి వారికి ఉపయోపడుతుంది. వ్యక్తులుగా ఎదగడానికి కూడా ఉపకరిస్తుంది. భారత యువ ఆటగాళ్లు సారథులుగా తమ జట్లను మెరుగ్గా నడిపించడం వల్ల భారత జట్టుకు కూడా ప్రయోజనమే'అని ద్రవిడ్ చెప్పాడు.

Story first published: Wednesday, June 8, 2022, 7:34 [IST]
Other articles published on Jun 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+