Ind vs SA: డికాక్ సెంచరీ.. అయినా కుప్పకూలిన సౌతాఫ్రికా! భారత్ ముందు టఫ్ టార్గెట్!

కేప్‌టౌన్: క్వింటన్ డికాక్(130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124) సూపర్ సెంచరీతో చెలరేగడంతో భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో సౌతాఫ్రికా 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు కుప్పకూలింది. డికాక్ తోడుగా
రాస్ వాన్ డెర్ డస్సెన్(59 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు ఏకంగా 144 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
అనంతరం చెలరేగిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసి సౌతాఫ్రికా భారీ స్కోర్‌ను అడ్డుకున్నాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(39) మెరుపులు మెరిపించినా మరో ఎండ్‌లో అతనికి సహకారం లేకపోయింది. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ దక్కింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని చేధించడం భారత్‌కు పెద్ద కష్టమేమి కాదు.

షాకిచ్చిన దీపక్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గట్టిషాక్ ఇచ్చాడు. గత మ్యాచ్ హాఫ్ సెంచరీ హీరో, సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జెన్నెమన్ మలన్(1)ను స్వింగ్ డెలివరీతో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా(8) తో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే కేఎల్ రాహుల్ సూపర్ ఫీల్డింగ్‌తో బవుమా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ వేసిన ఏడో ఓవర్‌లో బవుమా మిడాఫ్ మీదుగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ ముందుకు పరుగెత్తుకుంటూ బంతి నాన్ స్ట్రైకర్ వికెట్లకు డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో బవుమా నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన మార్క్‌రమ్(15)తో డికాక్ వేగంగా ఆడటంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
మళ్లీ చెలరేగిన డికాక్..
అనంతరం దీపక్ చాహర్ బౌలింగ్‌లో మార్క్‌రమ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డస్సెన్‌తో డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్మార్ట్‌గా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఇక బుమ్రా వేసిన 18వ ఓవర్ చివరి బంతిని క్విక్ సింగిల్ తీసి డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం జోరు పెంచిన డికాక్.. జయంత్ యాదవ్ వేసిన 21వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదాడు. అదే జోరులో చహల్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన డికాక్.. ప్రసిధ్ కృష్ణ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాది సెంచరీకి చేరువయ్యాడు. చాహల్ వేసిన 30వ ఓవర్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
డికాక్ 100.. డస్సెన్ 50
ఆ వెంటనే డస్సెన్ సైతం చాహర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ అనంతరం మరింత జోరు కనబర్చిన డికాక్‌ను జస్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 144 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే డస్సెన్‌ను చాహల్ క్యాచ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చి పెహ్లుక్వాయో(4)ను సూపర్ ఫీల్డింగ్ శ్రేయస్ అయ్యర్ రనౌట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ప్రిటోరియస్(20), మిల్లర్ ధాటిగా ఆడుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించారు. అయితే ప్రిటోరియస్‌ను స్లోయర్ బాల్‌తో ప్రసిధ్ బోల్తాకొట్టించగా.. క్రీజులోకి వచ్చిన మహరాజ్(6)ను బుమ్రా క్యాచ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ధాటిగా ఆడుతున్న మిల్లర్, మగల(0ను ప్రసిధ్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications