For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: పూజా వస్త్రాకర్ సంచలనం.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం ఓటమి నుంచి గట్టెక్కింది. బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పూజావస్త్రాకర్ సంచలన బౌలింగ్‌తో 4 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగులు చేసింది. స్మృతి మంధాన(120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 136), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. రిచా ఘోష్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

IND vs SA Pooja Vastrakar helps India squeezes out four-run win against South Africa

సౌతాఫ్రికా బౌలర్లలో ఎమ్‌లాబా రెండు వికెట్లు తీయగా.. క్లాస్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్(135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 135 నాటౌట్), మరిజన్నే కాప్(94 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్(2/54), దీప్తి శర్మ(2/56) రెండేసి వికెట్లు తీయగా.. తెలుగు తేజం అరుంధతి రెడ్డి(1/62), స్మృతి మంధానా(1/13) తలో వికెట్ తీసారు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో పూజా వస్త్రాకర్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చింది. 11 పరుగులను డిఫెండ్ చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టింది.

IND vs SA Pooja Vastrakar helps India squeezes out four-run win against South Africa

భారీ లక్ష్యచేధనలో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమవ్వగా.. పూజా వస్త్రాకర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇచ్చింది. తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతికి బౌండరీ వచ్చింది. దాంతో సఫారీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వరుసగా రెండు వికెట్లు తీసిన పూజా వస్త్రాకర్ మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పింది. చివరి 2 బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Wednesday, June 19, 2024, 21:02 [IST]
Other articles published on Jun 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+