Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: గాయం సాకుతో శుభ్‌మన్ గిల్‌పై వేటు?

టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. పేలవ ఫామ్‌తో వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్ చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. కాలి గాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌ నుంచి శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడని బీసీసీఐ పేర్కొంది. ప్రాక్టీస్ చేస్తుండగా శుభ్‌మన్ గిల్ బొటన వేలికి గాయమైందని తెలిపింది. దాంతో లక్నో వేదికగా జరిగే నాలుగో టీ20తో పాటు శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐదో టీ20కి గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది.

శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గిల్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 4, 0, 28 పరుగులతో 32 పరుగులే చేశాడు. గత 15 మ్యాచ్‌ల్లో 24.25 సగటు, 137.26 స్ట్రైక్‌రేట్‌తో 291 పరుగులే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

IND vs SA Out-of-Form Shubman Gill Ruled Out of Lucknow T20I Due to Foot Injury

ముఖ్యంగా గిల్ కోసం అద్భుత ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్‌ను తుది జట్టులో నుంచి తప్పించడంతో విమర్శలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌ను గాయం సాకుతో తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో అక్షర్ పటేల్ చివరి రెండు టీ20లకు దూరం కాగా.. అతని స్థానంలో షెహ్‌బాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 తీవ్ర పొగ మంచు కారణంగా రద్దయ్యింది.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ అనంతరం జనవరిలో న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇదే చివరి టీ20 సిరీస్.

Story first published: Wednesday, December 17, 2025, 22:04 [IST]
Other articles published on Dec 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+