For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: ఆ ముగ్గురికి నిరాశే.. మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ఆరంభించి, ఆపై రెండో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం రాత్రి 8.30 గంటలకు సెంచూరియన్ వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టుకు సిరీస్‌పై పట్టు చిక్కుతుంది. ఓడితే మాత్రం సీరిస్ సాధించే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

తొలి టీ20లో సంచలన ప్రదర్శన ఏక పక్ష విజయం సాధించిన భారత్.. రెండో టీ20లో మాత్రం తడబడింది. బ్యాటింగ్ వైఫల్యంతో 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తీ సంచలన బౌలింగ్‌తో విజయవకాశాలు సృష్టించుకుంది. కానీ చివర్లో పేసర్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. దాంతో తమ తప్పిదాలపై భారత్ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది.

IND vs SA No debut for Vijaykumar and Ramandeep Singh as India stick with same XI for 3rd T20I

వరుణ్ చక్రవర్తీపైనే అందరి కళ్లు..
పేస్ పిచ్‌లపై సంచలన బౌలింగ్‌తో చెలరేగుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీపైనే అందరి కళ్లు పడ్డాయి. తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. రెండో టీ20లో ఏకంగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. రెండు టీ20ల్లో సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్స్ హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు.

సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ మిస్టరీ స్పిన్నర్ పేస్‌కు అనుకూలంగా ఉండే సెంచరూరియన్ వికెట్‌పై ఎలా రాణిస్తాడో చూడాలి. అతనితో పాటు రవి బిష్ణోయ్ కూడా రాణిస్తున్నాడు. కానీ అక్షర్ పటేల్‌ను సూర్య సద్వినియోగం చేసుకోవడం లేదు.రెండో టీ20లో బ్యాటర్లతో పాటు పేసర్లు విఫలమయ్యారు.

ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే..
అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ చివర్లో ధారళంగా పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యారు. తొలి టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన భారత బ్యాటర్లు రెండో టీ20లో మాత్రం పరుగులు చేయడానికి తడబడ్డారు. సెంచరీ హీరో సంజూ డకౌట్ అయితే.. అభిషేక్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు.
సూర్య తీవ్రంగా నిరాశపరిచాడు. తిలక్ బాగానే ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అక్షర్ రనౌటయ్యాడు. హార్దిక్ రాణించినా.. చివర్లో బంతులను వృథా చేశాడు. రింకూ సింగ్ మరోసారి నిరాశపరిచాడు. భారత బ్యాటర్లు చెలరేగితే భారత్‌కు తిరుగుండదు.

ఆ ముగ్గురికి నిరాశే..
తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే రవిబిష్ణోయ్ స్థానంలో యశ్ దయాల్ ఆడొచ్చు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమణ్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, జితేశ్ శర్మలు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

IND vs SA No debut for Vijaykumar and Ramandeep Singh as India stick with same XI for 3rd T20I

సెంచూరియన్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ ఉంటుంది. ఇది స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్‌గా మారుతోంది. అదే విధంగా బ్యాట్‌పైకి బంతి వస్తుంది. ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. ఆరంభంలో పేసర్లను కాస్త ఆచితూచి ఆడితే.. పరుగులు చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

తుది జట్ల(అంచనా)
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తీ.

సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే సిమెలెన్/లుతో సిపమ్లా, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.

Story first published: Wednesday, November 13, 2024, 10:36 [IST]
Other articles published on Nov 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+