Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: సౌతాఫ్రికా పర్యటనలో ముఖేశ్ కుమార్ హనీమూన్!

IND vs SA: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా యువ పేసర్ ముఖేశ్ కుమార్.. ఓ వైపు ఆటతో పాటు మరో వైపు హనీమూన్‌ను ప్లాన్ చేసుకున్నాడు. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన ముఖేశ్ కుమార్ తనతో పాటు సతీమణి దివ్య సింగ్‌ను కూడా తీసుకెళ్లాడు. ఓవైపు మ్యాచ్ ఆడుతూనే.. మరోవైపు తమ దాంపత్య జీవితాన్ని ఆస్వాదించనున్నాడు.

ముఖేష్ కుమార్‌కు ఇటీవలే పెళ్లి అయిన విషయం తెలిసిందే. హార్‌కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గోరఖ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో నవంబర్ 28న ఘనంగా జరిగింది.

IND vs SA: Mukesh Kumar with his wife Divya Singh in South Africa, Pics goes viral

ఈ పెళ్లి కోసమే ముఖేష్ కుమార్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆడలేదు. ముందుగానే ఈ పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేయడంతో ఆ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉండి వివాహం పూర్తయిన వెంటనే మళ్లీ జట్టుతో కలిసాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పట్లో ముఖేశ్ కుమార్ శోభనం గురించి సోషల్ మీడియా వేదికగా జోకుటు పేలాయి. టీమిండియా కోసం శోభనాన్ని కూడా వాయిదా వేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేశారు.

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి రావడంతో అతను తన సతీమణితో ఎక్కవగా గడపలేకపోయాదు. దాంతో ఆమెను సౌతాఫ్రికా పర్యటనకు తీసుకొచ్చాడు. మ్యాచ్ మధ్యలోని గ్యాప్ టైమ్‌ను సతీమణితో ఆస్వాదిస్తున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ పర్మీషన్‌తో సతీమణితో కలిసి సౌతాఫ్రికా అందాలను ఆస్వాదిస్తున్నాడు.

తాజాగా ముఖేశ్ కుమార్, దివ్య సింగ్‌ల ఫొటో ఒకటి నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రీగా హనీమూన్ ప్లాన్ చేశాడని, మైదానంలో ఓ ఆట.. సతీమణితో మరో ఆట అంటూ ముఖేశ్ కుమారా? మజాకా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. సౌతాఫ్రికాతో ఆదివారం జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. రెండో మ్యాచ్ మంగళవారం జరగనుంది. మహమ్మద్ సిరాజ్‌తో కలిసి ముఖేశ్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గత కొద్ది రోజులుగా అతను నిలకడగా రాణిస్తున్నాడు.

Story first published: Monday, December 11, 2023, 22:57 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+