అసలు ఏం జరిగిందంటే?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ సిరాజ్ ఈ ఓవర్ వేయగా.. తొలి రెండు బంతుల్నీ సౌతాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ టచ్ చేయలేకపోయాడు. దాంతో బంతి వరుసగా కీపర్ సంజు శాంసన్ చేతుల్లోకి వెళ్తూ వచ్చింది. రెండో బంతిని అందుకున్న సంజు శాంసన్ మళ్లీ దాన్ని సిరాజ్‌కు డైరెక్ట్‌గా త్రో చేశాడు. అయితే ఆ బంతిని అందుకున్న సిరాజ్ ఆవేశంలో రనౌట్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లపైకి విసిరాడు. అప్పటికి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజులో డేవిడ్ మిల్లర్ లేడు. అతను క్రీజు వెలుపల ఉన్నాడు. కానీ.. సిరాజ్ గురి తప్పింది.
డెడ్ బాల్ అంటూ..
బంతి వికెట్లకి దూరంగా లాంగాన్ దిశగా వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఫీల్డర్ లేకపోవడంతో అలానే వెళ్లి బౌండరీని తాకింది. దాంతో అంపైర్ బౌండరీగా ప్రకటించాడు. అయితే.. కీపర్ చేతుల్లోనే బంతి డెడ్ అయిపోయిందని టీమిండియా ఆటగాళ్లు వాదించారు. కానీ వారి వాదనతో అంపైర్ ఏకీభవించలేదు. ఒకవేళ సిరాజ్ విసిరిన త్రో వికెట్లకి తాకి ఉంటే? అప్పుడు డేవిడ్ మిల్లర్ రనౌట్ కోసం సిరాజ్ అప్పీల్ చేసేవాడని, బౌండరీ వెళ్లడంతో నంగనాచి వేషాలు వేసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

టీమిండియా గ్రాండ్ విక్టరీ..
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (111 బాల్స్‌లో 15 ఫోర్లతో 113 నాటౌట్) క్లాసిక్ సెంచరీకి తోడు హోమ్టౌన్ రాంచీలో యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ (84 బాల్స్‌లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో రప్ఫాడించాడు. దాంతో, మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. తొలుత హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (10-1-38-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 278/7 స్కోరు చేసింది. మార్‌క్రమ్ (79), రీజా హెండ్రిక్స్ (74) సత్తా చాటారు.

161 పరుగుల భాగస్వామ్యం..
అనంతరం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూడో వికెట్‌కు 161 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌తో ఇండియా 45.5 ఓవర్లలోనే 282/3స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కెరీర్‌లో రెండో సెంచరీ సాధించిన శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డే మంగళవారం ఢిల్లీ వేదికగా జరుగనుంది.


Click it and Unblock the Notifications












