
భారత్ 16/1..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. మహమ్మద్ షమీ(5/44) ఐదు వికెట్లతో చెలరేగడంతో 197 పరుగులకే కుప్పకూలింది. షమీకి తోడుగా బుమ్రా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్ చెరొక వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా జట్టులో టెంబా బవుమా(103 బంతుల్లో 10 ఫోర్లతో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. క్వింటన్ డికాక్(63 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), కగిసో రబడా(45 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) కనీస పోరాట పటిమ కనబర్చారు. ఇక టీమిండియాకు 130 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (5 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ శార్దూల్ ఠాకూర్ (4 బ్యాటింగ్) ఉన్నారు. మయాంక్ అగర్వాల్(4) తీవ్రంగా నిరాశపరిచాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 146 పరుగుల ఆధిక్యంలో ఉంది.

55 పరుగుల వ్యవధిలోనే..
272/3 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 5 పరుగులు మాత్రమే చేసి కీలక రాహుల్ వికెట్ కోల్పోయింది. రబడా వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన రాహుల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఎంగిడి బౌలింగ్‌లో రహానే కూడా కీపర్ క్యాచ్‌గా ఔటయ్యాడు. 2 పరుగుల దూరంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(4)ను రబడా.. రిషభ్ పంత్(8)ను లుంగి ఎంగిడి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చారు. ఇక రబడా బౌలింగ్‌లో బౌండరీతో జోరు కనబర్చిన శార్దూల్ ఠాకూర్(4) మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన మరుసటి ఓవర్‌లోనే మహమ్మద్ షమీ(8) కూడా కీపర్ క్యాచ్‌గానే పెవిలియన్ చేరాడు. చివర్లో బుమ్రా రెండు బౌండరీలు బాదగా.. సిరాజ్ ఓ బౌండరీ బాదాడు. ఈ ఇద్దరు చివరి వికెట్‌కు విలువైన 19 పరుగులు జోడించారు. బుమ్రాను జాన్సన్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 55 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.

బుమ్రా శుభారంభంతో..
అనంతరం సౌతాఫ్రికాకు ఫస్ట్ ఓవర్‌లోను బుమ్రా షాకిచ్చాడు. ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్(1) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్(13), కీగన్ పీటర్సన్(15) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి ఫస్ట్ సెషన్‌ను ముగించారు. దాంతో సౌతాఫ్రికా 21/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం మహమ్మద్ షమీ, పీటర్సన్, మార్క్‌రమ్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే డస్సెన్‌ను సిరాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డికాక్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ నేలపాలు చేశాడు. అనంతరం బవుమాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ విడదీసాడు. డికాక్‌ను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మల్డర్, బవుమాలను షమీ పెవిలియన్ చేర్చగా.. జాన్సెన్‌ను శార్దూల్ ఔట్ చేశాడు. చివర్లో రబడా విసిగించినా మరోసారి షమీ అతన్ని ఔట్ చేయగా.. చివరి వికెట్‌ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

160 ప్లస్ రన్స్ చేస్తే..
ప్రస్తుతం 146 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ రేపు.. ధనాధన్ బ్యాటింగ్‌లో 160 రన్స్ చేసి 300 ప్లస్ టార్గెట్‌ను సౌతాఫ్రికాను ముందుంచితే విజయాన్నందుకోవచ్చు. రేపు సెకండ్ సెషన్‌లోపు వీలైతే ఫస్ట్ సెషన్ పూర్తిగా ఆడి ఈ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగి సౌతాఫ్రికాను ఆలౌట్ చేస్తే మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి విజయాన్నందుకోవచ్చు. చివరి రోజు వర్షం పడే అవకాశాలున్న నేపథ్యంలో రేపు వీలైనంత త్వరగా సౌతాఫ్రికాకు ఆహ్వానించడం ముఖ్యం. అదే విధంగా సేఫ్ సైడ్ టార్గెట్ కూడా ఉంచుకోవాలి.


Click it and Unblock the Notifications
