
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగించారు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/44) ఐదు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించి చరిత్రకెక్కగా.. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షమీ టెస్ట్ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న మూడో భారత పేసర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా కెరీర్‌లో ఆరో సారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన టేయిలెండర్ కగిసో రబడా(45 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడం ద్వారా షమీ.. 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.