Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చెలరేగిన మయాంక్, రాహుల్.. టీమిండియాకు సాలిడ్ స్టార్ట్!

IND vs SA: Mayank Agarwal, KL Rahul build on solid start

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(84 బంతుల్లో 7 ఫోర్లతో 46 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(84 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్) నిలకడగా రాణించడంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన భారత ఓపెనింగ్ ద్వయం.. సౌతాఫ్రికా బౌలర్లను గౌరవిస్తూనే వీలుచిక్కిన బంతిని బౌండరీకి బాదింది. పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్స్‌ట్రా బౌన్స్‌కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడారు. 18 బంతుల తర్వాతగానీ కేఎల్ రాహుల్ పరుగుల ఖాతా తెరవలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరు ఎంత ఓపిక వహించారో. ఓవైపు కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు పరిమితమైనా మయాంక్ అగర్వాల్ మత్రం బౌండరీలతో జోరు కనబర్చాడు. ఈ క్రమంలోనే అతను హాఫ్ సెంచరీకి చోరువయ్యాడు.

అయితే అరంగేట్ర పేసర్ మార్కో జాన్సెన్ వేసిన ఓవర్‌లో మయాంక్ అగర్వాల్‌కు లైఫ్ లభించింది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడిన మయాంక్ అగర్వాల్ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. అతని బ్యాట్‌ను ముద్దాడిన బంతి.. వికెట్ కీపర్‌కు రైట్ సైడ్‌గా దూసుకెళ్లింది. అయితే ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన డికాక్. క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పుడు మయాంక్ వ్యక్తిగత స్కోర్ 36 పరుగులు మాత్రమే. ఈ అవకాశాన్ని అందుకున్న మయాంక్.. తనలోని అసలు సిసలు టెస్ట్ బ్యాట్స్‌మన్‌ను నిద్రలేపాడు. జిడ్డూ బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం.. ద్రవిడ్ తరహా బ్యాటింగ్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు. ఈ మ్యాచ్‌కు అద్భుతంగా ప్రిపేరయ్యామని చెప్పాడు. ప్రాక్టీస్‌కు సెంటర్ వికెట్ దొరకడం అదృష్టమన్నాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నామని చెప్పాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ కూడా బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు.

Story first published: Sunday, December 26, 2021, 16:02 [IST]
Other articles published on Dec 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+