IND vs SA: చెలరేగిన కుల్దీప్.. సౌతాఫ్రికా చెత్త రికార్డు! గబ్బర్ సేన ముందు లడ్డూ లాంటి టార్గెట్!

న్యూఢిల్లీ: సిరీస్ డిసైడర్ మ్యాచ్.. వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అర్హత సాధించాలంటే సౌతాఫ్రికా తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్.. దాంతో హోరాహోరీ తప్పదని అభిమానులంతా అనుకున్నారు. కానీ భారత బౌలర్లు దుమ్మురేపడంతో ఉత్కంఠగా జరగాల్సిన పోరు కాస్త ఏకపక్షంగా మారింది. వికెట్ల కోసం భారత బౌలర్లు పోటీపడటంతో సౌతాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా అంతర్జాతీయ వన్డేల్లో మరో లోయెస్ట్ స్కోర్ నమోదు చేసి చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆ జట్టుకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్.

లోయెస్ట్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్(4/18) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. మహమ్మద్ సిరాజ్(2/17), వాషింగ్టన్ సుందర్(2/15), షెహ్‌బాజ్ అహ్మద్(2/7) రెండే వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. 4.1 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ యాదవ్ ఓ ఓవర్ మెయిడిన్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. తన ప్రదర్శనతో పాత కుల్దీప్ యాదవ్‌ను తలపించాడు.

ధావన్ మార్క్ కెప్టెన్సీ..
ఇన్నింగ్స్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ సూపర్ ప్లాన్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, జన్నెమన్ మలాన్ ఔటవ్వడం.. సౌతాఫ్రికాను దెబ్బతీసింది. డికాక్‌ని ఆరంభం నుంచి ఒత్తిడిలో ఉంచేందుకు ఫస్ట్ ఓవర్‌ని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ వేయించాడు. ఫస్ట్ ఓవర్‌లో మూడు బంతులు ఆడిన డికాక్ ఒక పరుగు మాత్రమే రాబట్టగాడు. దాంతో మళ్లీ మూడో ఓవర్‌లో సుందర్ చేతికి గబ్బర్ బంతినిచ్చాడు.
కానీ.. మూడో ఓవర్‌లో రెండో బంతికి డికాక్ షాట్ ఆడగా.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఐదో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా సుందర్ విసిరాడు. సాధారణంగా ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి పడగానే డికాక్ తనని తాను నియంత్రించుకోలేడు. అది అతని పెద్ద బలహీనత.

నడ్డి విరిచిన స్పిన్నర్లు..
ఆ తర్వాత సిరాజ్‌తో కలిసి ధావన్ జెన్నెమన్ మలాన్‌కు స్కెచ్ వేసాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డ్ పెట్టి షార్ట్ బాల్‌తో పుల్ షాట్ ఆడేలా టెంప్ట్ చేశారు. ఈ విషయాన్ని గ్రహించని మలాన్ పుల్ షాట్ ఆడి ఉచ్చులో పడ్డాడు. ఆ తర్వాత హెండ్రీక్స్ సైతం ఇదే షాట్ బాల్ వ్యూహంతో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత స్పిన్నర్లు షెహ్‌బాజ్ అహ్మద్, సుందర్, కుల్దీప్ సౌతాఫ్రికా నడ్డి విరచడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications