For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: అందుకే విరాట్ కోహ్లీ ఆడటం లేదు: కేఎల్ రాహుల్

IND vs SA: KL Rahul says Virat Kohli misses out due to upper back spasm
IND Vs SA : Umpire Warns KL Rahul | Oneindia Telugu

జోహన్నెస్ బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక వెన్నుగాయంతో బాధపడుతుండటంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా జట్టును నడిపించనున్నాడు. కోహ్లీ స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారీ జట్టులోకి వచ్చాడు. ఇంతకు మించి మరే మార్పు జరగలేదు. రాహుల్ సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక టాస్ గెలిచిన రాహుల్.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. ప్రతీ భారత ఆటగాడికి జట్టుకు నాయకత్వం వహించడమనేది ఓ కలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. భారీ స్కోర్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టేందుకు ప్రయత్నిస్తామన్నాడు. అప్పర్ బ్యాక్ స్పామ్‌తో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పిన రాహుల్.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడని, అంతకుమించి ఎలాంటి మార్పులు చోటేచేసుకోలేదని స్పష్టం చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఫిజియోల సూచనలతోనే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని, మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడని చెప్పాడు.

ఇక ప్రత్యర్థి కెప్టెన్ ఎవరా? అనే విషయం తమకు అవసరం లేదని సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్ స్థానంలో కైల్ వెరీన్ జట్టులోకి వచ్చాడని, వియాన్ ముల్డర్ ప్లేస్‌లో డాన్ ఓలివర్‌ను తీసుకున్నామని చెప్పాడు. క్వింటన్ డికాక్ సేవలం కోల్పోవడం జట్టుకు తీరని లోటేనని, కానీ విజయం కోసం సాయశక్తుల ప్రయతిస్తామన్నాడు. ఈ రెండు మార్పులు మమ్మల్ని తక్కువ అంచనా వేసేలా చేయవని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయమే కాదు... ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై వారి సొంతగడ్డపై సిరీస్‌ విజయం సాధించిన అద్వితీయ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ సహా ఆస్ట్రేలియాను కంగారూ పెట్టించినప్పటికీ దక్షిణాఫ్రికాపై మాత్రం దశాబ్దాలుగా సమర శంఖం పూరిస్తున్నా గెలిచే అవకాశం టీమిండియాకు దక్కలేదు. ఇప్పుడా సువర్ణావకాశం చేజిక్కించుకునేందుకు వాండరర్స్‌ మైదానం వేదికైంది.

తుది జట్లు:

భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, రిషభ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డెర్ డస్సెన్, టెంబా బవుమా, కైల్ వెర్రేన్(కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, ఓలివర్, లుంగి ఎంగిడి

Story first published: Monday, January 3, 2022, 13:41 [IST]
Other articles published on Jan 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+