Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే తుది జట్టులో మార్పు చేశాం: కేఎల్ రాహుల్

IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. అంతేకాకుండా చేజింగ్‌లో తమకు తాము పరీక్షపెట్టుకోవాలని భావించామని చెప్పాడు.

తొలి వన్డే పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పిన మార్క్‌రమ్.. ఈ మ్యాచ్ గెలిచేందుకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసిట్లు తెలిపాడు. బ్యూరన్ హెండ్రీక్స్, లిజాడ్ విలియమ్స్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.

IND vs SA: KL Rahul Reveals The Reason Why India Playing XI changed in 2nd ODI vs South Africa

ఇక పిచ్ ఎలా ఉందనేదానిపై తమకు క్లారిటీ లేదని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ టెస్ట్ టీమ్‌లో చేరడంతో రింకూ సింగ్ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు. 'కాసేపు ఓపికగా బ్యాటింగ్ చేసి పిచ్ ఎలా ఉందనేదానిపై ఓ అంచనాకు వస్తాం. చూడటానికి అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. టీ20 ఆడిన ఆటగాళ్లు మాత్రం.. ఈ వికెట్‌పై పేస్‌తో పాటు మంచి బౌన్స్ ఉంటుందని చెప్పారు.

బ్యాటింగ్‌లో భారీ లక్ష్యం నమోదు చేసి ప్రత్యర్థులపై ఒత్తిడి పెట్టడమే మా ప్రణాళిక. తొలి వన్డే తరహా మ్యాచ్ గురించి ఎక్కువ మాట్లాడవద్దు. ఆ గెలుపు క్రెడిట్ బౌలర్లది. దాని గురించి మాట్లాడటం కంటే తదుపరి గేమ్‌పైకి ఫోకస్ పెట్టడం ముఖ్యం. మూడు వన్డేలు వెనువెంటనే ఉన్నాయి కాబట్టి అనవసర విషయాలు గురించి కాకుండా ఆటపై ఫోకస్ పెట్టడం ముఖ్యం.

తుది జట్టులో ఒక మార్పు చేశాం. శ్రేయస్ అయ్యర్ టెస్ట్ టీమ్‌తో కలవడంతో రింకూ సింగ్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో గెలిచిన టీమిండియా అదే జోరులో ఈ మ్యాచ్ కూడా గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. తద్వారా చివరి వన్డేలో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది. సౌతాఫ్రికా మాత్రం ఎలాగైన గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది.

తుది జట్లు:
సౌతాఫ్రికా: టోనీ డీ జోర్జీ, రీజా హెన్రీక్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరన్ హెండ్రీక్స్

భారత్: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్స్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

Story first published: Tuesday, December 19, 2023, 16:42 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+