Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: జెమీమా శతకం.. భారత్ ఘన విజయం!

శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణుపు వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌‌కు చేరింది. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(101 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 123) శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. దీప్తి శర్మ(84 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93) తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. జెమీమాతో కలిసి ఐదో వికెట్‌కు 122 పరుగులు జోడించింది. సఫారీ బౌలర్లలో మసబట, నదినే, మ్లబా రెండేసి వికెట్లు తీసారు.

IND vs SA Jemimah Rodrigues career-best 123 helps India Beat South Africa in Tri-Series Clash

అనంతరం సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులే చేసి ఓటమిపాలైంది. అన్నరీ డెర్కెన్స్(80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), క్లోట్రయాన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, శ్రీ చరణి, ప్రతీకా రావల్ తలో వికెట్ తీసారు.

ఈ సిరీస్‌లో భారత్‌కు ఇది మూడో విజయం కాగా.. సౌతాఫ్రికాకు వరుసగా మూడో పరాజయం. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ టోర్నీ నుంచి సౌతాఫ్రికా నిష్క్రమించింది. శ్రీలంకతో సౌతాఫ్రికా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు 4 మ్యాచ్‌లో భారత్ మూడు గెలిచింది. శ్రీలంకతో ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లోశ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Wednesday, May 7, 2025, 19:11 [IST]
Other articles published on May 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+