IND vs SA: బూమ్ బూమ్ బుమ్రా.. కుప్పకూలిన సౌతాఫ్రికా! టీమిండియాకు లీడ్!

కేప్‌టౌన్: అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(5/42) అదరగొట్టాడు. నాలుగేళ్ల క్రితం ఇదే వేదికగా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చి సత్తాచాటిన బుమ్రా.. మళ్లీ తన మార్క్ పెర్ఫామెన్స్‌ను కనబర్చాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో టెస్ట్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 76.3 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ జట్టులో కీగన్ పీటర్సన్(166 బంతుల్లో 9 ఫోర్లతో 72) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు.
బూమ్ బూమ్ బుమ్రా..
17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మార్క్‌రమ్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌ను అంచనా వేయలేకపోయిన మార్క్‌రమ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో సౌతాఫ్రికా రెండో రోజు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్‌తో నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్(25) ఆచితూచి ఆడాడు. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని ఉమేశ్ యాదవ్ విడదీసాడు.
పీటర్సన్ సూపర్ బ్యాటింగ్..
సూపర్ డెలివరీతో కేశవ్ మహరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 45 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డస్సెన్‌తో కలిసి పీటర్సన్ సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు కావాల్సిన విలువైన పరుగులు అందించాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. దాంతో సౌతాఫ్రికా 100/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

అప్పనంగా 5 పరుగులు..
ఇక లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఉమేశ్ యాదవ్ విడదీసాడు. డస్సెన్(21)ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డస్సెన్ ఔటైనా.. టెంబా బవుమాతో జత కలిసిన పీటర్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. అయితే బవుమా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో పుజారా నేలపాలు చేశాడు. అంతేకాకుండా ఆ బంతి కాస్త.. కింద పెట్టిన ఫీల్డర్స్ హెల్మెట్‌కు తాకడంతో సౌతాఫ్రికాకు అప్పనంగా 5 పరుగులు వచ్చాయి.

చెలరేగిన బుమ్రా...
ఇక 50 ప్లస్ పార్ట్‌నర్‌షిప్ దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని మహమ్మద్ షమీ విడదీసాడు. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో బవుమాను పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కైల్ వెరీన్(0)ను కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. మార్కో జాన్సెన్‌తో పీటర్సన్ వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. కానీ జాన్సెన్(7)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. తన మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీ హీరో పీటర్సన్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన రబడా(15), ఒలివర్(10 నాటౌట్) విలువైన పరుగులు చేసి 200 మార్క్ ధాటించారు. అయితే చివరి వికెట్‌గా ఎంగిడిని పెవిలియన్ చేర్చిన బుమ్రా.. సఫారీ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

భారత్ 223
ఇక బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 7 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు. రబడా 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications