IND vs SA:సఫారీ గడ్డపై సిక్స్ కొట్టిన బుమ్రా.. కోహ్లీ, ద్రవిడ్, గంభీర్‌కూ చేతకాలేదు! (వీడియో)

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. చివర్లో ఓ సిక్స్, రెండు బౌండరీలతో అజేయంగా 14 పరుగులు చేసిన టీమిండియా స్కోర్‌ను 200 ధాటించాడు. బుమ్రా చేసినవి 14 పరుగులే అయినా అవి జట్టు పరువును కాపాడాయి. ఈ క్రమంలోనే బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై సిక్స్ బాదిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. హెమాహేమీ బ్యాట్స్‌మనే సుదీర్ఘ ఫార్మాట్‌లో సఫారీ గడ్డపై ఒక్క సిక్స్ కొట్టకపోగా.. బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.
సౌతాఫ్రికా గడ్డపై ఎన్నో రికార్డులు నమోదు చేసిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై సిక్స్ బాదలేదు. టీమిండియా వాల్, టెస్ట్ క్రికెట్ స్టార్ రాహుల్ ద్రవిడ్ సైతం సఫారీ గడ్డపై సిక్స్ బాదలేదు. చతేశ్వర్ పుజారా, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా సఫారీ గడ్డపై సిక్స్ కొట్టలేకపోయారు. కానీ బుమ్రా సూపర్ బ్యాటింగ్ సిక్స్ బాది ప్రత్యేకంగా నిలిచాడు. కగిసో రబడా బౌలింగ్‌లో అతను వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్‌లో రబడా ఒక్కడే సిక్స్ బాదాడం విశేషం.
బుమ్రా సిక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పుజారా, రహానే కంటే బుమ్రా ఎంతో నయమని కామెంట్ చేస్తున్నారు. బుమ్రాను చూసి సిగ్గుతెచ్చుకోవాలని విఫలమైన బ్యాట్స్‌మన్‌కు చురకలంటిస్తున్నారు. రహానే కంటే బుమ్రా బ్యాటింగ్‌నే ఆస్వాదిస్తున్నామని సెటైర్లు పేల్చుతున్నారు. బుమ్రాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని, అతన్ని నెంబర్ 7లో బ్యాటింగ్ పంపించాలని కోరుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు మార్కో జాన్సెన్(4/31), కగిసో రబడా(3/64), ఒలివియర్(3/64) సమష్టిగా చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(57 బంతుల్లో ఫోర్‌తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(12 బంతుల్లో 7)మరోసారి విఫలమయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications