For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: నిప్పులు చెరిగిన బుమ్రా.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. 62/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

ఎయిడెన్ మార్క్‌రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.

IND vs SA: Jasprit Bumrah Bags 6 As South Africa Set India 79-Run Target

98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మార్క్‌రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.

పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని అందుకోవడం టీమిండియా కాస్త కష్టమైన పనే. ఆచితూచి ఆడుతూ విజయాన్నందుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఘోర పరాజయం చవిచూడాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్‌ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.

అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.

భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46), శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.

Story first published: Thursday, January 4, 2024, 15:38 [IST]
Other articles published on Jan 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+