Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA టెస్ట్ సిరీస్ నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. తెలుగోడికి ఛాన్స్!

IND vs SA: భారత పర్యటనలో ఉన్న టీమిండియా టెస్ట్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆకస్మాత్తుగా స్వదేశం బయల్దేరాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్.. టెస్ట్ టీమ్ నుంచి తన పేరును విత్‌డ్రా చేసుకున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అతనికి రిప్లేస్‌మెంట్ తెలుగు తేజం శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేసింది.

ప్రస్తుతం భారత్-ఏ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న శ్రీకర్ భరత్.. రోహిత్ శర్మ సారథ్యంలోని టెస్ట్ టీమ్‌తో కలవనున్నాడు. ఇషాన్ కిషన్ టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే పొట్టి క్రికెట్‌లో అతనికి అవకాశం దక్కలేదు. ఇషాన్ కిషన్‌కు బదులు జితేశ్ శర్మకు అవకాశం ఇచ్చారు.

IND vs SA: Ishan Kishan withdraws from Test series, KS Bharat named replacement

టెస్ట్ సిరీస్‌లో కూడా బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ బయల్దేరడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారా? లేక ఇషాన్ కిషన్ పెళ్లి చేసుకుంటున్నాడా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. వన్డే సిరీస్‌ను పక్కనపెట్టి మరీ రెడ్ బాల్ క్రికెట్‌ ప్రిపరేషన్స్‌పై ఫోకస్ పెట్టింది.

రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని సపోర్ట్ స్టాఫ్ అంతా.. టెస్ట్ టీమ్ ప్రిపరేషన్స్‌ను పర్యవేక్షిస్తుండగా.. భారత్ ఏ టీమ్ సపోర్ట్ స్టాఫ్ గైడెన్స్‌లో వన్డే సిరీస్ జరుగుతోంది.

ఈ నెల 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ జరగనుంది. రెండో టెస్ట్ కేప్‌టౌన్ వేదికగా జనవరి 3-7 వరకు జరగనుంది.

టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ఆకాశ్‌ దీప్, ప్రసిద్ కృష్ణ, కేఎస్ భరత్(కీపర్).

Story first published: Sunday, December 17, 2023, 21:15 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+