Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: అందుకే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా పనికిరాడు!

IND vs SA: Is KL Rahul Right Captain For Team India?
Captain Poor KL Rahul Utterly Disappointed With Teamindia Show | Oneindia Telugu

హైదరాబాద్: సౌతాఫ్రికా పర్యటన‌కు ముందు పటిష్టంగా కనిపించిన టీమిండియా.. ఆ తర్వాత మ్యాచ్ మ్యాచ్‌కు చెత్త పెర్ఫామెన్స్ కనబరుస్తూ ఒట్టి చేతులతో ఇంటి ముఖం పట్టింది. అంచనాలకు తగ్గట్లుగానే తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా.. రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ‌లో గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇక అక్కడి నుంచి టీమిండియా పరాజయాల పరంపర కొనసాగింది. మూడో టెస్ట్‌కు కోహ్లీ అందుబాటులోకి వచ్చినా ఫలితం మారలేదు. ఈ వైఫల్యంతో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేయగా.. రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వన్డే సిరీస్‌లో జట్టును నడిపించాడు. చెత్త కెప్టెన్సీతో మూడు వన్డేల్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ మూల్యం చెల్లించుకుంది.

కెప్టెన్‌గా పనికిరాడు..

కెప్టెన్‌గా పనికిరాడు..

ఈ సిరీస్ ఓటమితో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి పనికిరాడనే చర్చ మొదలైంది. రాహుల్ సైతం ఒత్తిడిని ఏ మాత్రం అధిగమించలేకపోయాడు. మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డాడు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు కూడా పరిస్థితులకు తగ్గట్లు చేయలేకపోయాడు. దాంతో మూడు వన్డేల్లో టీమిండియా చిత్తయింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా పనికిరాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జ‌ట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్న‌ప్పుడు రాహుల్ వ్యూహాల‌ను ర‌చించ‌డంలో విఫ‌ల‌మయ్యాడ‌ని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించాడు.

 రాహుల్ చెత్త కెప్టెన్సీ..

రాహుల్ చెత్త కెప్టెన్సీ..

‘ఈ సిరీస్‌లో రాహుల్ కెప్టెన్‌గా పూర్తి స్ధాయిలో విఫ‌ల‌మయ్యాడు. సౌతాఫ్రికా భాగస్వామ్యాలను నెలకొల్పినప్పుడల్లా రాహుల్ త‌న వ్యూహాల‌కు దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయ‌కుండా ఆప‌డంలో రాహుల్ నిర్ణ‌యాలు నాకు సంతృప్తి పర‌చ‌లేదు. బ‌హుశా అత‌నికి అంత‌ర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా అంతగా అనుభ‌వంలేక పోవ‌డ‌మే దీనికి కార‌ణం కావ‌చ్చు. ఇక బ్యాటింగ్‌లో కూడా రాహుల్ విఫ‌ల‌మయ్యాడు" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఒత్తిడిని అధిగమించలేక..

ఒత్తిడిని అధిగమించలేక..

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. అతని చెత్త కెప్టెన్సీ కారణంగానే టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిందని అభిప్రాయపడ్డాడు. ‘కెప్టెన్‌గా రాహుల్ ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడు. ఆ ప్రెజర్‌లోనే బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. మూడో వన్డేలో డికాక్ సెంచరీ, డస్సెన్ హాఫ్ సెంచరీ చేసిన సమయంలో అతను తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. మైదానంలో సరైన నిర్ణయాలను రాహుల్ తీసుకోలేకపోయాడు. వారిని ఎలా ఔట్ చేయాలో తెలియక చాలా తప్పిదాలు చేశాడు. ఇక బ్యాటింగ్‌లో కూడా టీమిండియా మిడిలార్డర్ విఫలమైంది. 'అని జాఫర్ చెప్పుకొచ్చాడు.

 కెప్టెన్‌గా రాహుల్ చెత్త రికార్డు..

కెప్టెన్‌గా రాహుల్ చెత్త రికార్డు..

కెప్టెన్‌గా మెద‌టి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత ఆట‌గాడిగా రాహుల్‌ నిలిచాడు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార‌త కెప్టెన్ త‌న తొలి మూడు వ‌న్డేలు ఓడిపోలేదు. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గా కూడా రాహుల్ విఫ‌ల‌మ‌య్యాడు. మూడు లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడి.. భారత్ జట్టు వైట్‌వాష్‌కి గురవడం ఇది ఐదోసారి మాత్రమే. 1983లో వెస్టిండీస్‌ చేతిలో 0-5 తేడాతో వైట్‌వాష్‌కి గురైన భారత్ జట్టు.. ఆ తర్వాత 1989లో మళ్లీ విండీస్ చేతిలోనే 0-5 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 1997లో శ్రీలంక చేతిలో 0-3, 2020లో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది.

Story first published: Monday, January 24, 2022, 15:39 [IST]
Other articles published on Jan 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+