IND vs SA: 40 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో ఆతిథ్య సౌతాఫ్రికాతో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా టీ20 సిరీస్‌ల జరగనుండటంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం అక్కడికి చేరుకుంది.
భారత ఆటగాళ్లకు క్రికెట్ సౌతాఫ్రికా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ వంటి ప్లేయర్లు ఉన్నారు.

హాయ్ గాయ్స్ వెల్‌కమ్ టూ సౌతాఫ్రికా అంటూ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అయితే భారత ప్లేయర్లు సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన సమయంలో వర్షం పడినట్లు కనిపించింది. బీసీసీఐ విడుదల చేసి వీడియోలో భారత ప్లేయర్లు వర్షంలో పరిగెడుతూ కనిపించారు.
వైట్‌బాల్ సిరీస్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నారు. ప్రపంచకప్‌లో చీలమండ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.
డిసెంబర్ 10న జరిగే తొలి టీ20తో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన మొదలవ్వనుంది. రెండో టెస్ట్ ముగిసే జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సుమారు రెండు నెలల పాటు భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనలోనే ఉండనున్నారు.
టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. టెస్టు జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20: డిసెంబర్ 10, డర్బన్ వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం.
రెండో టీ20: డిసెంబర్ 12, జిక్యూబెర్హా వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం.
మూడో టీ20: డిసెంబర్ 14, జోహన్నెస్‌బర్గ్ వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్:
తొలి వన్డే: డిసెంబర్ 17, జోహెన్నస్‌బర్గ్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం.
రెండో వన్డే: డిసెంబర్ 19, జిక్యూబెర్హా వేదికగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.
మూడో వన్డే: పార్ల్ వేదికగా.. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు, సెంచూరియన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం
రెండో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు, కేప్‌టౌన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం
భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.