IND vs SA:భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం!
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా సంచలన విజయాన్నందుకుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ విధ్వంసకర శతకాలతో టీమిండియా 135 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో నాలుగు టీ20ల సిరీస్‌ను 3-1తొ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 నాటౌట్), తిలక్ వర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగగా... అభిషేక్ శర్మ(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సిపమ్లా(1/58) ఒక వికెట్ తీసాడు. భారత బ్యాటర్ల ధాటికి సఫారీ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అర్ష్‌దీప్ తీన్మార్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), మార్కో జాన్సెన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/42), అక్షర్ పటేల్(2/6) రెండే వికెట్లు పడగొట్టారు. రవిబిష్ణోయ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రమణ్‌దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్ సింగ్..
284 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(1) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
అర్ష్‌దీప్ సింగ్ తన మరుసటి ఓవర్‌లో వరుస బంతుల్లో సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(8)తో పాటు డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ ఆచితూచి ఆడారు. ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన అనంతరం డేవిడ్ మిల్లర్‌ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు.
చెలరేగిన బౌలర్లు..
ఆ మరుసటి ఓవర్‌లోనే రవి బిష్ణోయ్.. ట్రిస్టన్ స్టబ్స్2(43) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అనంతరం అండిలే సిమెలనె(2)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. గెరాల్డ్ కోయిట్జీ(12)కి అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు. తన మరుసటి ఓవర్‌లో కేశవ్ మహరాజ్(6)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో ఈ వికెట్ సాధించాడు. సిపమ్లా(3)ను రమణ్‌దీప్ సింగ్ ఔట్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. రమణ్‌దీప్‌కు ఇది తొలి వికెట్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications