Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA:సిరాజ్ ఔట్.. ఉమేశ్ యాదవ్ ఇన్! భారత్‌దే బ్యాటింగ్

India to bat first, Umesh replaces Siraj
కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వెన్న నొప్పి నుంచి కోలుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వగా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక రెండో టెస్ట్‌లో తొడ కండరాల గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వస్తాడని భావించినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ ఉమేశ్ యాదవ్‌కే అవకాశమిచ్చింది.

ఇక టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ పిచ్‌పై గడ్డి ఉందని, పేస్‌కు అనుకూలిస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నాడు. భారీ స్కోర్ చేస్తే టీమ్‌కు కలిసివస్తుందని, భారీ స్కోర్ చేసి ఆ తర్వాత తమ బౌలర్ల స్కిల్స్‌ను వాడుకోవాలన్నాడు. అందుకే బ్యాటింగ్ తీసుకున్నానని చెప్పాడు. ఇక నా వెన్ను నొప్పి మూడు రోజులే ఉందని, ఇప్పుడు బాగానే ఉందన్నాడు. సరిగ్గా గత మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ నొప్పి మొదలైందన్నాడు. విహారి స్థానంలో తాను బరిలోకి దిగుతున్నానని తెలిపిన విరాట్.. గాయం కారణంగా సిరాజ్ దూరమయ్యాడని చెప్పాడు. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇషాంత్, ఉమేశ్‌లో ఎవరా? అనేది తేల్చుకోవడం చాలా కష్టమైందన్నాడు. ఉమేశ్ అద్భుతమైన బౌలర్. మాకు గొప్ప బెంచ్ బలం ఉందన్నాడు.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఇక తాము కూడా బ్యాటింగే తీసుకోవాలనుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. తొలుత బౌలింగ్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా.. యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారని చెప్పుకొచ్చాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకుండా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని ఎల్గర్ స్పష్టం చేశాడు.

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక విజయాన్నందుకోవడంతో 1-1తో సిరీస్ సమమై ఈ మ్యాచ్ కీలకమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. ఇక మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ టెస్ట్ సిరీస్ విజయాన్నందుకోవాలని టీమిండియా భావిస్తోంది.

తుది జట్లు

భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్

IND VS SA 3rd Test : India's Test Cricket Records In Cape Town | Oneindia Telugu

సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, కీగన్ పీటర్సన్, డస్సెన్, టెంబా బవుమా, కైల్ వెర్రెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, ఓలివర్, లుంగి ఎంగిడి

Story first published: Tuesday, January 11, 2022, 14:37 [IST]
Other articles published on Jan 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+