For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టెస్ట్.. టీమిండియాను కలవరపెడుతున్న చెత్త రికార్డు!

IND vs SA: Indias record in Cape Town as Kohli & Co. aim for series win

హైదరాబాద్: సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచే జరిగే చివరి టెస్ట్‌లో కోహ్లీసేన అమీతుమీ తేల్చుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడు దశాబ్దాలుగా సఫరీ గడ్డపై దక్కని టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గాయంతో రెండో టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ రాకతో బలంగా మారిన భారత జట్టును సఫారీ సేన ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి. అయితే ఈ కీలక మ్యాచ్‌ ముందు కేప్‌టౌన్ మైదానంలోని రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయి.

1992-93లో ఫస్ట్ టెస్ట్..

1992-93లో ఫస్ట్ టెస్ట్..

ఇప్పటివరకు కేప్​టౌన్ మైదానంలో భారత్ ఐదు టెస్టు మ్యాచ్​లు ఆడగా.. ఇందులో రెండు డ్రాగా ముగియగా.. మూడు మ్యాచ్​ల్లో ఓటమిపాలైంది. 1992-93లో కేప్‌టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. డ్రాగా ముగిసింది. ఆ పర్యటనలో నాలుగో టెస్ట్ ఈ మైదానం వేదికగా జరగా.. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది.

1997లో జరిగిన మూడు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో రెండో టెస్టు కేప్​టౌన్ వేదికగా జరిగింది. అప్పటికే మొదటి టెస్టును 328 పరుగుల తేడాతో గెలుచుకుని జోరుమీదున్న సఫారీసేన.. రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. 282 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో సచిన్, అజారుద్దీన్ నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. టెండూల్కర్​ 169 పరుగులతో సత్తాచాటగా, అజారుద్దీన్ 115 పరుగులు సాధించాడు.

తొలి విజయం సాధించిన..

తొలి విజయం సాధించిన..

2006-07 పర్యటన‌లో తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ టెస్టు మ్యాచ్​ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న సౌతాఫ్రికా.. డర్బన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయంతో సిరీస్​ను సమం చేసింది. ఇక చివరిదైన మూడో టెస్టు కేప్​టౌన్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్​లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో సెంచరీ బాదిన వసీం జాఫర్​.. సౌతాఫ్రికా గడ్డపై శతకం చేసిన తొలి భారత ఓపెనర్​గా రికార్డు సృష్టించాడు.

2011 - డ్రా

2011 - డ్రా

2011 పర్యటనలో సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ గెలిచే అవకాశాన్ని టీమిండియా తృటిలో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్​లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్​ను గెలిచిన ధోనీసేన.. కేప్​టౌన్​లో జరిగిన మూడో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ రెండో ఇన్నింగ్స్​లో వీరోచిత శతకంతో సౌతాఫ్రికా స్టార్ ఆల్​రౌండర్ జాక్వెస్ కలిస్ మ్యాచ్​ను డ్రాగా ముగించాడు. ఇదే టెస్టులో సెంచరీ (146) బాదిన సచిన్​కు ఈ ఫార్మాట్​లో ఇదే చివరి శతకం కావడం విశేషం.

2018 పర్యటనలోనూ..

2018 పర్యటనలోనూ..

2018 పర్యటనలో తొలి టెస్టును కేప్​టౌన్ వేదికగా ఆడిన టీమిండియా... బ్యాటింగ్ వైఫల్యంతో విజయం ముంగిట బోల్తాపడింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారానే టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికాను 286 పరుగులకే కట్టడి చేసిన భారత్​.. తన మొదటి ఇన్నింగ్స్​లో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా 95 బంతుల్లో 93 పరుగులతో భారత్​ను గట్టెక్కించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్​లో విజయం సాధించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కానీ భారత బ్యాటర్లు విఫలమవడం వల్ల 135 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Story first published: Monday, January 10, 2022, 21:34 [IST]
Other articles published on Jan 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+