Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: భారత్‌దే బ్యాటింగ్.. తెలుగోడికి మళ్లీ అన్యాయమే!

 India bat, Ajinkya Rahane plays

సెంచూరియన్: సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. విదేశాల్లో ముందుగా బ్యాటింగ్ చేసి భారీగా పరుగులు చేయడమే తమ బలమని, పిచ్ కూడా తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా గడ్డపై ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ప్రత్యర్థి జట్టు ఎప్పటికి బలంగానే ఉంటుందని, వారికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసున్నాడు.

ఈ మ్యాచ్‌కు అద్భుతంగా ప్రిపేరయ్యామని చెప్పాడు. ప్రాక్టీస్‌కు సెంటర్ వికెట్ దొరకడం అదృష్టమన్నాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్నామని చెప్పాడు. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ కూడా బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు.

ఇక వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలకు ఊహించినట్లుగానే అనుభవం పేరిట అవకాశం దక్కింది. దాంతో శ్రేయస్ అయ్యర్, తెలుగు క్రికెటర్ హనుమ విహారిలకు మొండి చేయ్యే ఎదురైంది. టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆడటం గొప్పగా ఫీలవుతున్నానని సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ చెప్పాడు. ఈ సిరీస్ కోసం జోహన్నస్ బర్గ్‌ ప్రాక్టీస్ క్యాంప్‌లో అన్ని విధాలుగా సిద్దమయ్యామని చెప్పాడు. మార్కో జాన్సెన్ అరంగేట్రం చేస్తున్నాడని, ఆల్‌రౌండర్‌గా మల్డర్, ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. కగిసో రబడాతో పాటు లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ పేస్ బాధ్యతలు పంచుకుంటారని చెప్పాడు.

తొలి టెస్టుపై మొదటి రోజు నుంచే పైచేయి సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. విశేషానుభవం గల రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం జట్టుకు బాగా ఉపకరిస్తుంది. మరోవైపు సొంతగడ్డ అనుకూలతలతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రన్నరప్‌ భారత్‌ను ఆరంభం నుంచే ఇబ్బందుల్లోకి నెట్టాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా భావిస్తోంది. పేస్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే లేని లోటు జట్టును బాధిస్తున్నప్పటికీ సత్తాగల ఆటగాళ్లు ఉన్న సఫారీ జట్టు... భారత్‌కు ఐదు రోజులూ పెను సవాళ్లు విసిరేందుకు 'సై' అంటోంది.

తుది జట్లు
భారత్‌: కేఎల్ రాహుల్, మయాంక్‌ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే, రిషభ్‌ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌.

సౌతాఫ్రికా: డీన్‌ ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, కీగన్‌ పీటర్సన్, వాన్‌ డెర్‌ డసెన్, టెంబా బవుమా, క్వింటన్ డికాక్, వియాన్‌ మల్డర్, కేశవ్‌ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి, మార్కో జాన్సెన్

Story first published: Sunday, December 26, 2021, 13:32 [IST]
Other articles published on Dec 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+