Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చెలరేగిన సఫారీ బౌలర్లు.. కుప్పకూలిన భారత్!

 IND vs SA: India all out for 202 as Jansen takes 4

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు మార్కో జాన్సెన్(4/31), కగిసో రబడా(3/64), ఒలివియర్(3/64) సమష్టిగా చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

శుభారంభం లేదు..

శుభారంభం లేదు..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఫస్ట్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లతో 26) క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయగా.. జాన్సెన్ దెబ్బతీసాడు. కీపర్ క్యాచ్‌గా అతన్ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా(33 బంతుల్లో 3) తన వైఫల్యాన్ని కొనసాగించాడు. పేలవ ఫామ్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పుజారా.. బంతిని ఆడేందుకు తీవ్రంగా తడబడ్డాడు. సరైన ఫుట్ వర్క్ లేకపోవడంతో పదే పదే బంతులు ఎడ్జ్ తీసుకోని గాల్లోకి లేచాయి.

పుజారా, రహానే విఫలం..

పుజారా, రహానే విఫలం..

చివరకు స్వేచ్చగా ఆడలేకపోతున్న పుజారాను ఓలివర్ సూపర్ బాల్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌన్సర్‌ను వెంటాడిన రహానే స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ(53 బంతుల్లో 3 ఫోర్లతో 20)తో కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50 ) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో ఇండియా 53/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

విహారీ సైతం..

విహారీ సైతం..

బ్రేక్ అనంతరం ఆచితూచి ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. హనుమ విహారి ఇచ్చిన సునాయస క్యాచ్‌ను టెంబా బవుమా విడిచిపెట్టగా.. ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతన్ని జాన్సెన్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. క్రీజులోకి వచ్చిన అశ్విన్, రిషభ్ పంత్(43 బంతుల్లో ఫోర్‌తో 17) మరో వికెట్ పడకుండా రెండో సెషన్ ముగించారు. దాంతో భారత్ 146/5 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

ఆదుకున్న అశ్విన్..

ఆదుకున్న అశ్విన్..

బ్రేక్ అనంతరం రిషభ్ పంత్‌ను జాన్సెన్.. బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(0)ను ఒలివియర్ స్లిప్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. మహమ్మద్ షమీ(12 బంతుల్లో ఫోర్‌తో 9) సాయంతో అశ్విన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షమీని రిటర్న్ క్యాచ్‌గా రబడా పెవిలియన్ చేర్చగా.. హాఫ్ సెంచరీకి చేరువైన అశ్విన్‌ను జాన్సెన్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు. క్రీజులోకి వచ్చిన బుమ్రా(14 నాటౌట్) ఓ సిక్స్ రెండు బౌండరీలతో 200 మార్క్‌ను ధాటించాడు. ఇక సిరాజ్(1)ను రబడా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Monday, January 3, 2022, 20:15 [IST]
Other articles published on Jan 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+