For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: బెడిసి కొట్టిన వ్యూహం.. కోహ్లీ పోరాడినా కుప్పకూలిన టీమిండియా!

IND vs SA: India 223-all out after Virat Kohli hits classy 79

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో టెస్ట్‌లో టీమిండియా వ్యూహం బెడిసి కొట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన చెత్త బ్యాటింగ్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(201 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 79) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. చతేశ్వర్ పుజారా(77 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరూ మినహా మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/73) నాలుగు, మార్క్ జాన్సేన్(3/55) మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్, ఓలివర్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్క్‌రమ్(8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్(6బ్యాటింగ్) ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఓపెనర్లు విఫలం..

ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(12), మయాంక్ అగర్వాల్(15) వెనువెంటనే ఔటై తీవ్రంగా నిరాశపరిచారు. ముందుగా ఓలివర్ బౌలింగ్‌లో రాహుల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. రబడా వేసిన ఆ మరుసటి ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో భారత్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాతో కలిసి నిదానంగా ఆడాడు. తన శైలికి భిన్నంగా పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు పుజారా ఆడపా దడపా బౌండరీలు బాదిన విరాట్ మాత్రం క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకున్నాడు. దాంతో టీమిండియా 75/2‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

దెబ్బకొట్టిన జాన్సెన్..

ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మార్కో జాన్సెన్‌ విడదీసాడు. పుజారాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి మూడో వికెట్‌కు నమోదైన 62 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వా క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(9)కూడా దారుణంగా విఫలమయ్యాడు. రబడా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

కళాత్మక షాట్లతో విరాట్..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. నిదానంగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని పంత్ బౌండరీకి తరలించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ.. తన క్లాస్ ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. చూడ ముచ్చటైన కవర్ డ్రైవ్స్‌తో అలరించాడు. ఓ భారీ సిక్సర్ సైతం బాదాడు. దాంతో టీమిండియా 141/4తో టీ బ్రేక్‌కు వెళ్లింది. అయితే బ్రేక్ అనంతరం రిషభ్ పంత్‌ను జాన్సెన్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(2) తీవ్రంగా నిరాశపరచగా.. ఓలివర్ బౌలింగ్‌లో బౌండరీ బాది విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరుసగా వికెట్లు..

అనంతరం వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన విరాట్.. వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మరోవైపు శార్దూల్ ఠాకూర్ ఓ సిక్సర్, బౌండరీతో ఆశలు రేకెత్తించాడు. కానీ అదే జోరులో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ కొద్దిసేపటికే జస్‌ప్రీత్ బుమ్రా(0)కూడా ఔటవ్వడంతో మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. దాంతో పరుగులు చేయాలనే ఆతృతలో రబడా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అప్పటి వరకు ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వదిలేసిన విరాట్.. చివరకు పరుగులు చేయాలనే ఆతృతలో అదే బంతికి బలయ్యాడు. దాంతో మరో సారి సెంచరీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మహమ్మద్ షమీ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Tuesday, January 11, 2022, 22:30 [IST]
Other articles published on Jan 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+