India vs South Africa: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమైంది. ఈ టూర్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లకు సంబంధించిన వేర్వేరు భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
ఈ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యారు. వైట్‌బాల్ సిరీస్‌లకు అందుబాటులో ఉండమని ఈ ఇద్దరూ బీసీసీఐకి సమాచారమిచ్చారు.

ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ.. ప్రస్తుతం లండన్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. డబ్ల్యూటీసీ 2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
వైట్‌బాల్ సిరీస్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నారు. ప్రపంచకప్‌లో చీలమండ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.
డిసెంబర్ 10న జరిగే తొలి టీ20తో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన మొదలవ్వనుంది. రెండో టెస్ట్ ముగిసే జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సుమారు రెండు నెలల పాటు భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనలోనే ఉండనున్నారు.

జియో సినిమాలు రావు: భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్‌లను అభిమానులు రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమాలో ఫ్రీగా వీక్షించారు. అయితే భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌లకు స్టార్ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్. ఆ సంస్థకు చెందిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఛానెల్స్‌లోనూ ఈ మ్యాచ్‌లు ప్రతక్ష్య ప్రసారం కానున్నాయి.
ఫ్రీగా చూడాలంటే..?: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ నచ్చిన భాషలో ఈ మ్యాచ్‌లను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వీక్షించవచ్చు. ఆసియా కప్‌తో పాటు ప్రపంచకప్ 2023ను ఫ్రీగా చూసే అవకాశాన్ని డిస్నీ హాట్‌స్టార్ తొలి సారి కల్పించింది. జియో సినిమాతో ఉన్న పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా టూర్‌కు సంబంధించిన మ్యాచ్‌లను కూడా ఉచితంగా అందించేందుకు సిద్దమైంది.