ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత బ్యాటర్ల హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది.
తిలక్ వర్మ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 73), హార్దిక్ పాండ్యా(25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు. సంజూ శాంసన్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఓట్నిల్ బార్ట్‌మన్, జార్జ్ లింగే తలో వికెట్ తీసారు.
