IND vs SA: సినిమా థియేటర్‌ను తలపిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ మైదానం! ఆటగాళ్ల భారీ కటౌట్లతో ఫ్యాన్స్ సందడి!

తిరువనంతపురం: సినిమాల రిలీజ్ సమాయాల్లో థియేటర్ల ముందు తమ అభిమాన నటులు భారీ కటౌట్లను ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఆ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ.. డప్పులతో చిందులేస్తూ ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. కానీ ఫస్ట్ టైమ్ ఓ క్రికెట్ మైదానం ముందు ఇలాంటి వాతావరణాన్ని చూసి క్రీడా ప్రేమికలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పోటాపోటీగా తమ అభిమాన ఆటగాళ్ల కటౌట్లు ఏర్పాటు చేయడం చూస్తూ ముచ్చటపడుతున్నారు. మరికొద్ది సేపట్లో భారత్ X సౌతాఫ్రికా మధ్య కేరళలోని తిరువనంతపురం వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ జరగనున్న గ్రీన్ ఫీల్డ్ మైదానం ముందు అభిమానులు చేస్తున్న సందడి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
కోహ్లీతో షురూ..
ముందుగా విరాట్ కోహ్లీ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఆల్ కేరళ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పేరిట ఏర్పాటు చేసిన భారీ కటౌట్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ కటౌట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ అభిమానులు ఫిదా అయ్యారు. కెప్టెన్సీ లేకున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటూ సంబరపడ్డారు. కొందరు అత్యుత్సాహంతో రోహిత్ శర్మ అభిమానులను ట్రోల్ చేశారు. రోహిత్ కెప్టెన్ అయినా.. అతనికి ఏ కటౌట్ లేదంటూ ట్రోల్ చేశారు.
రోహిత్, ధోనీ ఫ్యాన్స్ సైతం..
ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు కోహ్లీ కంటే భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. విరాట్ అభిమానులను ఎగతాళి చేశారు. రోహిత్ కటౌట్‌లో విరాట్‌ది సగం కూడా లేదని సెటైర్లు పేల్చారు. ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయగా..దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ రెండు కటౌట్లును చూసిన ధోనీ అభిమానులు.. తమ వాడేం తక్కువ కాదంటూ.. భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు.
జట్టులో లేకున్నా..
ఇక సంజూ శాంసన్ అభిమానులు సైతం.. తమ రాష్ట్ర హీరో అంటూ అతని భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. మైదానం ముందే ఈ నలుగు కటౌట్లు ఉండటంతో అభిమానులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ సినిమా థియేటర్ల ముందే వాతవారణం తలపిస్తోంది. సౌతాఫ్రికాతో ఆడే జట్టులో లేకున్నా సంజూ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్లేయర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications