Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: 6 ఏళ్ల తర్వాత మ్యాచ్.. జట్టులో ఉన్నది ఒకే ఒక్కడు!

భారత్-సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగింది. అయితే కోల్‌కతా వేదికగా 6 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 2019లో చివరిసారిగా ఇక్కడ భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఆడిన భారత జట్టులోని ఒకే ఒక్క ఆటగాడు ప్రస్తుత టీమ్‌లో ఆడుతున్నాడు. ఐదుగురు ఆటగాళ్లు రిటైర్ అవ్వగా.. మరో ఐదుగురు భారత జట్టులో చోటు కోల్పోయారు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన ఈడెన్ గార్డెన్స్ వేదికగా గత 6 ఏళ్లలో ఒక్క మ్యాచ్ జరగలేదు. ఇప్పటి వరకు ఈ మైదానం వేదికగా 42 టెస్ట్‌లు జరిగాయి. టీమిండియా తొలి డేనైట్ పింక్ బాల్ టెస్ట్‌కు కూడా కోల్‌కతానే వేదికగా నిలిచింది. విచిత్రం ఏంటంటే ఆ మ్యాచే ఈ వేదికగా చివరిదైంది. మళ్లీ ఇన్నాళ్లకు సౌతాఫ్రికాతో టెస్ట్ జరుగుతుంది. 1948 తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇన్నాళ్లు మ్యాచ్ జరగకపోవడం ఇదే తొలిసారి.

IND vs SA Five Legends Retire Five Players Dropped Ravindra Jadeja Stands Alone at Eden Gardens

2019లో రవిశాస్త్రి పర్యవేక్షణలో విరాట్ కోహ్లీ సారథ్యంలో బంగ్లాదేశ్‌పై డేనైట్ టెస్ట్ ఆడింది. ఆ జట్టులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, వృద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

ఈ ముగ్గురు పేసర్లు బంగ్లాదేశ్ కోల్పోయి 20 వికెట్లలో 19 వికెట్లు పడగొట్టింది. కోహ్లీ సెంచరీతో రాణించగా.. పుజారా, రహానే అర్థ సెంచరీలతో రాణించారు. భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టులో ఆడిన రవీంద్ర జడేజా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్‌లతో మొత్తం ఐదుగురు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. మయాంక్ అగర్వాల్, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ‌లు జట్టులో చోటు కోల్పోయారు.

2019లో బెంచ్‌పై కూర్చున్న శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్‌ ప్రస్తుత జట్టులో కీలక ప్లేయర్లుగా మారారు. గిల్ ప్రస్తుత కెప్టెన్ కాగా.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 6 ఏళ్ల క్రితం ఆ మ్యాచ్‌ను ఒకే చోట కూర్చుని చూసిన ఆటగాళ్లు.. నాయకులుగా ఎదిగారు.

Story first published: Friday, November 14, 2025, 12:28 [IST]
Other articles published on Nov 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+