IND vs SA: చుక్కలు చూపించిన సూరీడూ... చితక్కొట్టిన రాహుల్, కోహ్లీ, రోహిత్.. సౌతాఫ్రికా ముందు టఫ్ టార్గెట్!

గౌహతి: బ్యాట్స్‌మన్ ప్యారడైజ్‌గా మారిన మైదానంలో సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61)మరోసారి చుక్కలు చూపించాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి తోడుగా కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) దంచికొట్టారు. దాంతో సౌతాఫ్రికా ముందు టీమిండియా 238 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.
రోహిత్, రాహుల్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57)శుభారంభం అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ప్రతీ ఓవర్‌లో పోటాపోటీగా ఈ ఇద్దరూ బౌండరీలు బాదడంతో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. దాంతో టీ20ల్లో అత్యధిక సార్లు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా రోహిత్-రాహుల్ రికార్డుకెక్కారు. పవర్ ప్లే అనంతరం కూడా ఈ జోడీ ధాటిగా ఆడింది.
దెబ్బ కొట్టిన కేశవ్..
96 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విడదీసాడు. హాఫ్ సెంచరీ ముంగిట రోహిత్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో రాహుల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే అతను 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మహరాజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులోకి వచ్చిన సూర్య వచ్చిరావడంతోనే బౌండరీ బాదాడు. తనదైన 360 డిగ్రీల ఆటతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
చెలరేగిన సూరీడు..
మరోవైపు విరాట్ కోహ్లీ సైతం.. చెలరేగడంతో భారత స్కోర్ బోర్డు వేగంగా పరుగెత్తింది. పార్నెల్ వేసిన 17వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన సూర్య.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఎంగిడి బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన సూర్య.. 19వ ఓవర్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్.. ఓ బౌండరీతో పాటు రెండు సిక్స్‌లు కొట్టడంతో టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications