గ్రౌండ్ స్టాఫ్ కుట్ర..
అయితే ఓవైపు కేఎల్ రాహుల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితం కావడంతో విరాట్ రిస్క్ తీసుకొని విఫలమయ్యాడు. దాంతో విరాట్, రోహిత్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఫ్లాట్ వికెట్స్‌పైనే విరాట్, రోహిత్ చెలరేగుతారని, స్వింగ్ బంతులంటే ఇలానే ఔటవుతారని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం ఈ మ్యాచ్‌కు సిద్దం చేసిన వికెట్‌పై జోకులు పేల్చుతున్నారు. తమ రాష్ట్రానికి చెందిన సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వలేదని గ్రౌండ్ స్టాఫ్ కుట్ర పన్నినట్లున్నారని, ఆ క్రమంలోనే భారత బ్యాటర్లు విఫలమయ్యేలా స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌ను రెడీ చేశారని కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో డకౌటవ్వడం ద్వారా రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 9వ సారి డకౌట్ అయిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది రెండో సారి సున్నాకే వెనుదిరిగాడు. దాంతో కెప్టెన్‌గా ఓ క్యాలండర్ ఇయర్‌లో రెండు సార్లు డకౌటైన తొలి సారథిగా రోహిత్ చెత్త రికార్డును నమోదు చేశాడు. స్వింగ్ బౌలింగ్‌కు భారత టాప్-3 బ్యాటర్లు తడబడటంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 17 పరుగులే వచ్చాయి. టీ20ల్లో టీమిండియాకు ఇది సెకండ్ లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్.
అర్ష్‌దీప్ సింగ్ తీన్మార్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ ఎయిడెన్ మార్క్‌రమ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), వేన్ పార్నెల్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24), కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 70 డాట్ బాల్స్ వేయడం గమనార్హం. భారత బౌలర్లలో
అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

సూర్య సూపరో సూపర్
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications












