Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కేఎల్ రాహుల్ తప్పిదం.. బుమ్రా అసహనం

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో రాహుల్ లడ్డూ లాంటి క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి బౌలింగ్‌కు దిగింది.

పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో సఫారీ ఓపెనర్లను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చారు. తాత్కలిక సారథి రిషభ్ పంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ వదిలేసాడు. బుమ్రా వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

IND vs SA Fans Slam KL Rahul After He Drops Aiden Markram s Catch on Day 1 of the 2nd Test
Photo Credit: X(twitter)

లడ్డూ లాంటి క్యాచ్..

మార్క్‌రమ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. కానీ కాస్త లో హైట్‌లో రావడంతో రాహుల్ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే మార్క్‌రమ్ 4 పరుగులకే వెనుదిరిగేవాడు. రాహుల్ క్యాచ్ వదిలేయడంపై బుమ్రాతో పాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ ఈజీ క్యాచ్ పట్టాల్సిందని తన సైగలతో అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మార్క్‌రమ్(38).. ర్యాన్ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. దాంతో రాహుల్‌పై ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

ఏమిరా రాహుల్.. నీ వల్ల ఈ జట్టుకు లాభం..?

అసలు కేఎల్ రాహుల్‌తో జట్టుకు వచ్చే లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు.' బ్యాటింగ్‌లో రాణించడు.. ఫీల్డింగ్‌ సరిగ్గా చేయడు.. అయినా జట్టులో రాహుల్‌కు అవకాశం ఎందుకు?'అని ప్రశ్నిస్తున్నారు. ప్యాచప్ ఇన్నింగ్స్ ఆడటం మినహా రాహుల్ వల్ల జట్టుకు ఒరిగేది ఏం లేదని మండిపడుతున్నారు. కొందరైతే 'ఏమిరా రాహుల్ నీ వల్ల జట్టుకు లాభం'అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ' ఓరి నికృష్టుడా.. దరిద్రుడా? నీ వల్ల జట్టుకు నష్టమవుతుందిరా'అనే సినిమా డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

తొలి రోజు సఫారిదే..

మార్క్‌రమ్‌ను ఎట్టకేలకు బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఓపికగా ఆడిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81.5 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(112 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49), టెంబా బవుమా(92 బంతుల్లో 5 ఫోర్లతో 41) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్‌‌రమ్(81 బంతుల్లో 5 ఫోర్లతో 38), ర్యాన్ రికెల్టన్(82 బంతుల్లో 5 ఫోర్లతో 35) అద్భుతమైన ఆరంభం అందించారు.

సౌతాఫ్రికా బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో తొలి రెండు సెషన్లలో సౌతాఫ్రికా పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. కుల్దీప్ యాదవ్(3/48) గేమ్ ఛేంజ్ బౌలింగ్‌తో ఆఖరి సెషన్‌లో భారత్ పైచేయి సాధించింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, November 22, 2025, 12:49 [IST]
Other articles published on Nov 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+