IND vs SA: టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ సెంచరీ సాధించడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్.. అందరి అంచనాలను అందుకుంటూ శతకం బాదడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సౌతాఫ్రికాతో గురువారం జరిగిన మూడో వన్డేలో సంజూ శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేసి వన్డేల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. దాంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. సంజూ శాంసన్ తన బ్యాట్‌తోనే విమర్శకుల నోరు మూయించాడని, హేటర్స్‌కు ఇది చెంప పెట్టు అని కామెంట్ చేస్తున్నారు.

సంజూ శాంసన్‌కు బీసీసీఐ అన్యాయం చేసిందనే విషయాన్ని ఈ సెంచరీ ద్వారా నిరూపించాడని, వన్డే ప్రపంచకప్ జట్టులో అతనికి చోటివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను సెలెక్ట్ చేయాల్సిందని, ఓవర్‌సీస్‌లో సెంచరీ చేసి తన సత్తా ఏంటో సంజూ చూపించాడని పోస్ట్‌లు పెడుతున్నారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలో సంజూకు బాగా తెలుసని, 2019 వన్డే ప్రపంచకప్‌లో అంబటి రాయుడు, 2023 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్‌ను పక్కనపెట్డంతో టీమిండియా మూల్యం చెల్లించుకుందని గుర్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సంజూ శాంసన్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడగా.. తిలక్ వర్మ సాయంతో సంజూ శాంసన్ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. 110 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108) సెంచరీతో కదం తొక్కగా.. తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్(3/63) మూడు వికెట్లు తీయగా.. నండ్రె బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లిజా విలియమ్స్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.