For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: శభాష్ రాహుల్.. మగాడిలా ఆడావ్!

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఫైటింగ్‌ నాక్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై విరోచిత బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ‌తో రాణించాడు. టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. పేస్ అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరగడంతో ఓ దశలో టీమిండియా 150 పరుగులు కూడా చేస్తుందా? అని అనిపించింది.

కానీ రాహుల్.. పిచ్‌కు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్ చేస్తూ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు.

IND vs SA: Fans hail KL Rahul for his fighting knock in 1st Test vs South Africa

శ్రేయస్ అయ్యర్ ఔటైన అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్.. ఓవైపు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వెనువెంటనే వెనుదిరిగినా.. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. జస్‌ప్రీత్ బుమ్రా సాయంతో 8వ వికెట్‌కు 27 పరుగులు.. సిరాజ్ సాయంతో జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను ధాటించాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్.. అనంతరం మరింత ధాటిగా ఆడాడు.

రాహుల్ ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఆడిన తీరును చూస్తుంటే ఒకప్పటి టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ చూసినట్లు ఉందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొందరైతే 'శభాష్ రాహుల్.. మగాడిలా బ్యాటింగ్ చేశావ్'అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రాహుల్.. పేరు మారుమోగుతోంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్ ఆట సాధ్యం కాలేదు. వెలుతురు కూడా మందగించడంతో అంపైర్లు చివరి సెషన్ ఆటను రద్దు చేసి తొలి రోజును ముగించారు.

ఎల్ రాహుల్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) విరోచిత ఇన్నింగ్స్‌‌కు అండగా విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలోకగిసో రబడా(5/44), నండ్రే బర్గర్(2/50)కు తోడుగా మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(5)తో పాటు యశస్వీ జైస్వాల్(17), శుభ్‌మన్ గిల్(2) తీవ్రంగా నిరాశపరిచారు.

Story first published: Tuesday, December 26, 2023, 21:58 [IST]
Other articles published on Dec 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+