
జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తడబడింది. దాంతో తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన సఫారీ జట్టు.. ఆ తర్వాత ఓపికగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(57 బంతుల్లో ఫోర్‌తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(12 బంతుల్లో 7)మరోసారి విఫలమయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించాలంటే.. రెండో రోజు బౌలర్లు చెలరేగి.. సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు మార్కో జాన్సెన్(4/31), కగిసో రబడా(3/64), ఒలివియర్(3/64) సమష్టిగా చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌటవ్వగా.. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26), హనుమ విహారి (20), రిషభ్ పంత్ (17), మహమ్మద్ షమి (9), మహమ్మద్ సిరాజ్ (1) పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్ కాగా.. జస్ప్రీత్ బుమ్రా 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానె (0) మరోసారి చేతులెత్తేశారు.