For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: ముగిసిన మూడో రోజు ఆట.. విజయం దిశగా సౌతాఫ్రికా! అద్భుతం జరిగితేనే..

IND vs SA: Elgar falls late as SA reach 101/2 at Stumps

కేప్‌టౌన్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతన్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. అయితే సౌతాఫ్రికాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ విధించిన 212 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 111 పరుగులు చేయాలి. మరోవైపు భారత్‌ గెలవాలంటే మిగిలిన ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. క్రీజులో కీగన్ పీటర్సన్(48 నాటౌట్) ఉన్నాడు.

ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(16)ను త్వరగానే ఔట్ చేసిన భారత బౌలర్లు.. పీటర్సన్-ఎల్గర్‌ (30) జోడీని విడదేసేందుకు చమటోడ్చారు. అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన ఎల్గర్ రివ్యూతో బచాయించాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన అతను స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో ఎట్టకేలకు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భారత బౌలర్లు షమీ, బుమ్రా చెరో వికెట్‌ తీశారు.

రేపు తొలి సెషన్‌లో వికెట్లను తీసినదానిని బట్టి విజయం ఖరారవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే.. కేగిన్ పీటర్సన్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేసి.. మిగతా వికెట్లను పడగొట్టాలి. తొలి ఇన్నింగ్స్ మాదిరి భారత బౌలర్ల చెలరేగితే తిరుగుండదు.

అంతకుముందు 57/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(100 నాటౌట్) ఒక్కడే అజేయ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ(29) అతనితో విలువైన భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు..

తొలి ఇన్నింగ్స్‌: భారత్‌ 223/10.. సౌతాఫ్రికా 210/10

రెండో ఇన్నింగ్స్‌: భారత్ 198/10.. దక్షిణాఫ్రికా 101/2 (29.4 ఓవర్లు)

Story first published: Thursday, January 13, 2022, 22:49 [IST]
Other articles published on Jan 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+