For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రెండో రోజు దేవుడికే.. వర్షంతో బంతి పడకుండానే రద్దయిన ఆట!

IND vs SA Day 2: Rain washes out play on Monday

సెంచూరియన్: ఊహించిందే జరిగింది. భారత విజయవకాశాలపై వరుణ దేవుడు నీళ్లు చల్లాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం మొదలైన తొలి టెస్ట్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించి భారీ స్కోర్ చేయాలని భావించిన కోహ్లీసేనకు వర్షం రూపంలో ఊహించని షాక్ తగిలింది.

వర్షం కారణంగా రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం చిత్తడిగా మారింది. లంచ్ బ్రేక్ ముగిసినా వరుణుడు కరుణివ్వకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. మూడో రోజు కొంచెం ముందుగానే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గంటలకే ఆటను ప్రారంభించనున్నారు. అయితే ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగా మారింది. పైగా ఇక సౌతాఫ్రికా వెదర్ ఫోర్ కాస్ట్ ప్రకారం.. మూడు, నాలుగో రోజు వర్షం వచ్చే సూచన లేకున్నా.. చివరి రోజు వర్షం పడే అవకాశం ఉంది. దాంతో వచ్చే రెండు రోజులు ఆట జరిగినా.. ఫలితం తేలడం కష్టం. తొలి రోజును సూపర్ బ్యాటింగ్‌తో భారత్ తమ ఖాతాలో వేసుకోగా.. రెండో రోజును వరణుడు మింగేసాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మూడో రోజు వేగంగా ఆడి భారీ స్కోర్‌ను సౌతాఫ్రికా ముందు ఉంచాలి. ఆ తర్వాత ఆ జట్టును తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి తమ ముందున్న చిన్న టార్గెట్‌ను త్వరగా చేధించాలి. సెంచూరియన్ మైదానంలో వికెట్‌ను చూస్తే ఇదంతా జరగడం కష్టంగా అనిపిస్తోంది. తొలి రోజు పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించింది. అయితే వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉన్న నేపథ్యంలో రేపు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. మిగిలిన ఆటలో వర్షంతో ఏ ఒక్క సెషన్ రద్దయినా.. మ్యాచ్ ఫలితం తేలడం కష్టం.

ఓపెనర్‌ కేల్‌ రాహుల్‌ (248 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 122 బ్యాటింగ్‌) అజేయ సెంచరీ సాధించడంతో తొలి రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (123 బంతుల్లో 9ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్‌.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు.

ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 4ఫోర్లతో 35), అజింక్యా రహానే ( 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 బ్యాటింగ్‌)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.

Story first published: Monday, December 27, 2021, 18:23 [IST]
Other articles published on Dec 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+