IND vs SL: నోబాల్స్‌తో కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్.. భారత్ ముందు భారీ లక్ష్యం!

పుణే: శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. పేలవ బౌలింగ్‌తో పోటాపడి పరుగులిచ్చుకున్నారు. దాంతో శ్రీలంక 207 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు. మొత్తం 7 నోబాల్స్ వేసిన భారత బౌలర్లు వీటిద్వారా అదనంగా 34 పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు.

దుమ్మురేపిన ఓపెనర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లు తప్పిదాలను క్యాష్ చేసుకున్న శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. తొలి నాలుగు ఓవర్లలోనే భారత బౌలర్లు నాలుగు నో బాల్స్ వేయడంతో మూమెంటమ్‌ను అందుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెంటనే స్పిన్నర్లును బరిలోకి దించి పరిస్థితిని చక్కదిద్దాడు. దాంతో శ్రీలంక పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది.

ఉమ్రాన్ దెబ్బతీసినా..
ఆ తర్వాత కూడా స్పిన్నర్లను కొనసాగించిన హార్దిక్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఓపెనింగ్ జోడీని యుజ్వేంద్ర చాహల్ విడదీసాడు. కుశాల్ మెండీస్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో రివ్యూ ద్వారా హార్దిక్ ఈ వికెట్ సాధించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సను ఉమ్రాన్ మాలిక్.. సూపర్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చరిత్ అసలంక, పాతుమ్ నిస్సంక ఇన్నింగ్స్ కొనసాగించే ప్రయత్నం చేసినా.. అక్షర్ పటేల్ దెబ్బతీసాడు. రాహుల్ త్రిపాఠి స్టన్నింగ్ క్యాచ్‌తో పాతుమ్ నిస్సంకను పెవిలియన్ చేర్చాడు.

చెలరేగిన డసన్ షనక..
తన మరుసటి ఓవర్‌లో ధనంజయ డిసిల్వా(3)ను కూడా అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికి ధాటిగా ఆడుతున్న చరిత్ అసలంక(37)ను ట్రాప్‌లో పడేసి పెవిలియన్ చేర్చిన ఉమ్రాన్ మాలిక్.. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా ఫాస్టెస్ట్ బౌలింగ్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్ పేస్‌కు భయపడిన హసరంగా.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో లంక 138 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించినట్లు అనిపించింది. కానీ శ్రీలంక కెప్టెన్ డసన్ షనక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉమ్రాన్, అర్ష్‌దీప్, శివమ్ మావిల బౌలింగ్‌ను చితక్కొట్టి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను ధాటించాడు. అర్ష్‌దీప్ సింగ్ నోబాల్స్ అతను క్రీజులో కుదురుకునేలా చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications