For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్(211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్) శతకంతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్‌హమ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఎల్గర్‌తో పాటు మార్కో జాన్సెన్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాడ్ లైట్ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే అంపైర్లు ఆటను ముగించారు.

IND vs SA: Bad light leads to early Stumps after South Africa take lead

రాహుల్ ఫైటింగ్ సెంచరీ..
అంతకు ముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను 245 పరుగులకు ముగించింది. మహమ్మద్ సిరాజ్‌తో 9వ వికెట్‌కు 47 పరుగులు జోడించిన రాహుల్.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

వేగంగా పరుగులు చేసిన రాహుల్.. సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.

సిరాజ్ శుభారంభం..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే సిరాజ్ షాకిచ్చాడు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌(5)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన టోడీ డీ జోర్జీతో జాగ్రత్తగా ఆడిన డీన్ ఎల్గర్.. మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో సౌతాఫ్రికా 49/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

అనంతరం సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ సౌతాఫ్రికా స్కోర్ బోర్డును పరుగెత్తించింది. 93 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. టోనీ డీ జోర్జీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్(2)ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సౌతాఫ్రికా 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

శతక్కొట్టిన ఎల్గర్..
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ బెడింగ్‌హమ్‌తో డీన్ ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 79 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. అనంతరం మరింత ధాటిగా 140 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా 194/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

చివరి సెషన్‌లో డేవిడ్ బెడింగ్ హమ్‌ 80 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతన్ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్‌కు నమోదైన 131 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయన్నే(4)ను ప్రసిధ్ ఔట్ చేయగా.. మార్కో జాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు.

Story first published: Wednesday, December 27, 2023, 22:01 [IST]
Other articles published on Dec 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+