For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: చెలరేగిన సూర్య, రాహుల్.. భారత్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు!

IND vs SA: Arshdeep, Suryakumar take IND to 8-wicket win on tough pitch against SA

తిరువనంతపురం: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్.. కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

కానీ ఎయిడెన్ మార్క్‌రమ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), వేన్ పార్నెల్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24), కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 70 డాట్ బాల్స్ వేయడం గమనార్హం. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, September 28, 2022, 22:44 [IST]
Other articles published on Sep 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+