Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్..!

భారత్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అర్ష్‌దీప్ సింగ్(0/54) పేలవ బౌలింగ్ ప్రదర్శన టీమిండియా కొంపముంచింది. క్వింటన్ డికాక్(46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది.

డోనవన్ ఫెర్రెయిరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/29) రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. క్వింటన్ డికాక్ భారీ షాట్లతో విరుచుకుపడగా.. రీజా హెన్రీక్స్(8)‌ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేసాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(29) ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అదే జోరు కొనసాగించిన ఈ జోడీ 10 ఓవర్లలో 90 పరుగులు చేసింది. 11వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 7 వైడ్లతో మొత్తం 13 బంతులు వేసి 18 పరుగులిచ్చాడు.

IND vs SA Arshdeep Singh s Poor Spell Helps South Africa Reach 213 4 in High-Scoring Clash

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సౌతాఫ్రికా దూకుడుగా ఆడింది. 73 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని వరుణ్ చక్రవర్తీ విడదీసాడు. స్లోగా ఆడుతున్న మార్క్‌‌రమ్(29)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే సెంచరీ దిశగా సాగిన డికాక్.. జితేష్ శర్మ అద్భుత త్రోతో రనౌటయ్యాడు. ఆ వెంటనే డెవాల్డ్ బ్రెవిస్(14)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా పరుగుల వేగం తగ్గింది. కానీ డోనవన్ ఫెర్రెయిరా, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్‌ను 200 మార్క్ ధాటించారు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ వైఫల్యం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది.

Story first published: Thursday, December 11, 2025, 21:14 [IST]
Other articles published on Dec 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+