For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్!

IND vs SA 1st ODI: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికా గడ్డపై ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా రికార్డుకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఓవరాల్‌గా సఫారీ గడ్డపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ కంటే ముందు భారత స్పిన్నర్లు అయిన సునీల్ జోషి(5/6), యుజ్వేంద్ర చాహల్(5/22), రవీంద్ర జడేజా(5/33) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.

IND vs SA: Arshdeep Singh becomes 1st Indian pacer to pick ODI 5-wicket haul vs South Africa

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే వరుస బంతుల్లో ఓపెనర్ రీజా హెండ్రీక్స్(0), రాసీ వాన్ డెర్ డస్సెన్‌(0)లను డకౌట్‌ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆచితూచి ఆడిన టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) మరుసటి ఓవర్‌లోనే పెవిలియ్ చేర్చాడు. అనంతరం హెన్రీచ్ క్లాసెన్‌(6)ను క్లీన్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన హెహ్లుక్వాయోను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

అర్ష్‌దీప్ సింగ్‌కు తోడుగా ఆవేశ్ ఖాన్(4/27) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఇక వన్డే క్రికెట్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 2018లో సఫారీ గడ్డపై ఇదే భారత జట్టుతో 118 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. తాజా మ్యాచ్‌లో 116 పరుగులకే కుప్పకూలింది.

ఓవరాల్‌గా సౌతాఫ్రికాకు ఇది పదో అత్యల్ప స్కోర్. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 69 పరుగులకు కుప్పకూలింది. ఇదే వన్డే క్రికెట్‌లో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్‌గా ఉంది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Sunday, December 17, 2023, 17:32 [IST]
Other articles published on Dec 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+