For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రఫ్ఫాడించిన అర్ష్‌దీప్ సింగ్.. 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా!

IND vs SA: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్(4/27) రఫ్ఫాడించారు. దాంతో ఆతిథ్య సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు సౌతాఫ్రికాకు రెండో ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ రీజా హెండ్రీక్స్(0), రాసీ వాన్ డెర్ డస్సెన్‌(0)లను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడిన టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)ని అర్ష్‌దీప్ సింగ్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియ్ చేర్చాడు.

 IND vs SA: Arshdeep Singh, Avesh Khan restrict South Africa to 116 in 1st ODI

అనంతరం హెన్రీచ్ క్లాసెన్‌(6)ను కూడా అర్ష్‌దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోనే సౌతాఫ్రికా 52 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆవేశ్ ఖాన్ వికెట్ల వేటను ప్రారంభించాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(12)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆవేశ్ ఖాన్.. వియాన్ ముల్దర్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. డేవిడ్ మిల్లర్(2), కేశవ్ మహరాజ్(4) క్యాచ్ ఔట్‌లుగా పెవిలియన్ చేర్చాడు.

ఆండిలో పెహ్లుక్వాయో కాస్త ఆచితూచి ఆడటంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్క్‌ను ధాటింది. అతన్ని అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఇది ఫస్ట్ ఫైవ్ వికెట్ హాల్. నండ్రె బర్గర్(7)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, December 17, 2023, 16:20 [IST]
Other articles published on Dec 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+