For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రిషభ్ పంత్‌కు అగ్ని పరీక్ష.. సౌతాఫ్రికాతో డూ ఆర్ డై ఫైట్ నేడే!

IND vs SA 4th T20 Preview: India seek to extend fightback as de Kock return looms

రాజ్‌కోట్: వరుసగా రెండు ఓటముల తర్వాత అచ్చొచ్చిన విశాఖలో గెలిచి సిరీస్‌లో నిలిచిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. రిషభ్ పంత్‌ నేతృత్వంలోని యువ భారత్‌కు వైజాగ్ టీ20 విజయం గొప్ప ఊరటనిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఉదాసీనతకు తావివ్వకుండా ఇదే తీవ్రతను రాజ్‌కోట్‌లోనూ కొనసాగించడం కీలకం. ఇక్కడ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే నిర్ణయాత్మక చివరి టీ20లో టీమిండియాకే ఎక్కువ అవకాశాలుంటాయి.

పంత్‌కు అగ్ని పరీక్ష..

పంత్‌కు అగ్ని పరీక్ష..

ఈ సిరీస్‌లో టీమిండియాను బాగా కలవరపెడుతున్న అంశం.. రిషభ్ పంత్‌ వైఫల్యం. వివిధ ఫార్మాట్లలో అతని రికార్డు చూసి సీనియర్లు లేని ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు అందించగా అతను తడబడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 29, 5, 6.. ఇవీ అతడి స్కోర్లు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పంత్‌ నాయకత్వ సామర్థ్యం మీదా సందేహాలు కలిగాయి. విశాఖలో టీమిండియా ఘనవిజయంతో అతను కాస్త ఒత్తిడి నుంచి బయటపడి ఉంటాడు. ఇప్పుడు బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించడం, కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయడం అవసరం. కెప్టెన్‌ అన్న ఆలోచన పక్కన పెట్టి పంత్‌ తన సహజ శైలిలో చెలరేగాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

భారీ స్కోర్ చేయాలి..

భారీ స్కోర్ చేయాలి..

ఇషాన్‌ కిషన్‌ చక్కటి ఫామ్‌ను కనబరుస్తుండగా.. మూడో టీ20లో రుతురాజ్‌ కూడా ఫామ్‌ అందుకోవడం శుభ పరిణామం. ఆ మ్యాచ్‌లో హార్దిక్‌ కూడా అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ బాగానే ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. తొలి టీ20లో 212 పరుగుల లక్ష్యాన్ని కూడా సఫారీ జట్టు అలవోకగా ఛేదించిన నేపథ్యంలో మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే.. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విధ్వంసకరంగా ఆడి భారీ స్కోరు సాధించి పెట్టడం కీలకం.

ఆవేశ్ ఖాన్ ఔట్..

ఆవేశ్ ఖాన్ ఔట్..

తొలి మ్యాచ్‌ ప్రదర్శనను పక్కన పెడితే.. భారత బౌలర్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంది. ప్రధాన స్పిన్నర్‌ చాహల్‌ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్, హర్షల్‌ పటేల్‌ తొలి టీ20 తర్వాత గొప్పగా పుంజుకున్నారు. అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌ల నుంచి జట్టు ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. అవేష్‌ బాగానే బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. సిరీస్‌లో ఇప్పటిదాకా వికెట్టే తీయలేదు. అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లే పడగొట్టాడు. వీరిని పక్కన పెట్టాలనుకుంటే యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌తో పాటు అరంగేట్ర ఆటగాళ్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ల్లో ఒకరు జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎలాంటి మార్పులుండకపోవచ్చు.

బరిలోకి డికాక్..

బరిలోకి డికాక్..

దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరగొచ్చు. గాయం నుంచి కోలుకున్న డికాక్‌ తుది జట్టులోకి వచ్చేట్లయితే.. రీజా హెండ్రిక్స్‌పై వేటు పడుతుంది. డికాక్‌ తిరిగొస్తే ఆ జట్టు బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది. అతడితో పాటు వాండర్‌డసెన్‌, మిల్లర్‌, క్లాసెన్‌ల నుంచి భారత బౌలర్లకు ప్రధానంగా ముప్పు పొంచి ఉంది. వీరిని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చడం కీలకం. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎవరూ అంత నిలకడగా రాణించట్లేదు. రబాడ, ప్రిటోరియస్‌ కాస్త భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. స్పిన్నర్లు షంసి, కేశవ్‌ మహరాజ్‌ అనుకున్నంతగా సమస్యలు సృష్టించట్లేదు. అయినప్పటికీ ఈ ప్రపంచ స్థాయి స్పిన్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Story first published: Friday, June 17, 2022, 8:55 [IST]
Other articles published on Jun 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+