
1. చెత్త ఫీల్డింగ్
టీమిండియా ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. కీలక సమయాల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బౌండరీలను కూడా ఆపలేకపోయారు. పరుగులను కూడా కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా ఆరంభంలోనే మిల్లర్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సంజూ వదిలేయగా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో మరోసారి సిరాజ్ నేలపాలు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఓ బౌండరీని ఆపడంలో విఫలమయ్యాడు. పేలవ ఫీల్డింగ్ కారణంగా.. సౌతాఫ్రికాకు 20 పరుగులు అదనంగా వచ్చాయి. ఇవే భారత ఓటమిని శాసించాయి. క్యాచ్‌లు పట్టినా.. బౌండరీలు ఆపినా.. ఫలితం మరోలా ఉండేది. రోహిత్ సేనతో పాటు గబ్బర్ సేన సైతం స్థాయికి తగ్గ ఫీల్డింగ్ చేయలేకపోతుంది.

2. పేలవ బౌలింగ్
పేలవ బౌలింగ్ సైతం భారత్ పతనాన్ని శాసించింది. బౌలింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కట్టడిగా బౌలింగ్ చేసినా.. త్వరగా ఔట్ చేయడంలో విఫలమయ్యారు. 12 ఓవర్ల తర్వాత శార్దూల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లు ఓ వికెట్ పడగొట్టారు. కానీ అదే జోరు మ్యాచ్ ఆసాంతం చూపలేకపోయారు. ముఖ్యంగా క్లాసెన్, మిల్లర్ ధ్వయాన్ని భారత బౌలర్లు విడదీయలేకపోయారు. రవి బిష్ణోయ్, సిరాజ్‌లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. దాంతో సౌతాఫ్రికా అదనంగా 20 పరుగులు చేసింది. శార్దూల్ అందించిన బ్రేక్ త్రూను అలానే కొనసాగించి ఉంటే టీమిండియాకు విజయం దక్కేది.

3. శుభారంభం లేదు
బౌలింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై 250 పరుగుల లక్ష్యం 300తో సమానం. అలాంటి కొండంత లక్ష్యాన్ని చేధించాలంటే శుభారంభం దక్కడం ముఖ్యం. కానీ భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన రుతురాజ్, ఇషాన్ కిషన్.. డిఫెన్స్ ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చాలా బంతులను డాట్ చేశారు. కానీ సఫారీ స్పిన్నర్లు ముందు తేలిపోయి వికెట్లు ఇచ్చుకున్నారు. వీరు ఎక్కువ బంతులు డాట్ చేయడం భారత్‌పై ఒత్తిడిని పెంచెంది. ఓపెనర్లు శుభారంభం అందించినా.. రుతురాజ్, ఇషాన్‌లో ఒక్కరు క్రీజులో సెట్ అయినా భారత్‌కు కలిసొచ్చేది.

4. సంజూకు సపోర్ట్ లేకపోవడం..
51 పరుగులకే 4 వికెట్లు పోయి కష్టల్లో ఉన్న జట్టును సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఔటైనా.. శార్దూల్ ఠాకూర్ ధనాధన్ బ్యాటింగ్ చెలరేగాడు. మరోవైపు సంజూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో విజయం ఖాయమని అంతా భావించారు. కానీ శార్దూల్ ఠాకూర్‌ను లుంగి ఎంగిడి ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ సౌతాఫ్రికావైపు మళ్లింది. ఆ తర్వాత వచ్చిన టెయిలండర్లు బంతులను వృథా చేయడంతో పాటు వరుసగా ఔటయ్యారు. దాంతో సంజూ ఒంటరివాడయ్యాడు. చివరి ఓవర్‌లో 30 పరుగులు చేయాల్సి రావడంతో ధాటిగా ఆడి 20 పరుగులు పిండుకున్నాడు. శ్రేయస్, శార్దూల్‌లో ఒక్కరు ఇన్నింగ్స్ ముగిసేవరకు నిలుచున్నా.. ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేది.


Click it and Unblock the Notifications












