
దినేశ్ కార్తీక్‌ను ఆలస్యంగా పంపించడం...
బ్యాటింగ్ ఆర్డర్‌లో బిగ్ హిట్టర్ అయిన దినేశ్ కార్తీక్‌ను ఆలస్యంగా బ్యాటింగ్ పంపిస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతం తప్పుబట్టాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొందిన కార్తీక్ ఏడో స్థానంలో పంపించడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. కార్తీక్‌కు ముందు అక్షర్ పటేల్‌ను పంపించగా అతను దారుణంగా విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్ 21 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అదే అతన్ని మరింత ముందుకు పంపించి ఉంటే మరో 10-20 పరుగులు అదనంగా చేసేవాడు.

చెత్త బ్యాటింగ్
ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన డేవిడ్ మిల్లర్.. సౌతాఫ్రికాతో కూడా అదే జోరు కొనసాగిస్తూ విజయాలందిస్తున్నాడు. మరోవైపు భారత ఆటగాళ్లు మాత్రం సఫారీల పేస్‌కు తడబడుతున్నారు. ముఖ్యంగా రెండో టీ20లో భారత బ్యాటర్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(1), రిషభ్ పంత్(5), హార్దిక్ పాండ్యా(9), అక్షర్ పటేల్(10) వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. కాస్తో కూస్తో ఆడిన ఇషాన్ కిషన్(34), శ్రేయస్ అయ్యర్(40) కీలక సమయంలో ఔటవ్వడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

చాహల్, అక్షర్ పటేల్ విఫలం..
టీమిండియా స్పిన్నర్లు ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒకే ఓవర్ వేసి 19 పరుగులు సమర్పించుకోగా.. యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో సఫారీ బౌలర్లు చెలరేగారు. భువనేశ్వర్ కుమార్ (4/13) ఒక్కడే అద్భుత ప్రదర్శన కనబర్చగా.. అతనికి సరైన సహకారం లభించలేదు.

టాస్ ఓటమి
ఇక టాస్ ఓడిపోవడం కూడా టీమిండియా పతనానికి కారణమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పంత్ టాస్ ఓడిపోయాడు. దాంతో సఫారీ కెప్టెన్ బవుమా ముందుగా బౌలింగ్ తీసుకొని భారత్‌పై పై చేయి సాధిస్తున్నాడు. టాస్ గెలవడం వల్ల మైదాన పరిస్థితులు సఫారీకి కలిసొచ్చాయి. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, తేమ ప్రభావం ఉండటంతో చేజింగ్‌కు సులవవుతోంది. ఈ క్రమంలోనే టాస్ కూడా భారత ఓటమికి ఓ కారణమైంది.


Click it and Unblock the Notifications
